Telugu Directors: ఓ పెద్ద సినిమా చేస్తూనే మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్న దర్శకులు.. ఇదే నయా ట్రెండ్ అంటూ..

ఓ భారీ సినిమా చేస్తున్నపుడు దర్శకుల ఫోకస్ అంతా దానిమీదే ఉంటుంది.. మరో సినిమా గురించి ఆలోచించే టైమ్ వాళ్లకుండదు. కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం.. ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పుడందరూ అదే దారిలో వెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ అయిపోయిందిప్పుడు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Jan 17, 2024 | 2:03 PM

ఓ భారీ సినిమా చేస్తున్నపుడు దర్శకుల ఫోకస్ అంతా దానిమీదే ఉంటుంది.. మరో సినిమా గురించి ఆలోచించే టైమ్ వాళ్లకుండదు. కానీ ఇక్కడ కొందరు దర్శకులు మాత్రం.. ఓ పెద్ద సినిమా చేస్తూనే మధ్యలో మరో చిన్న సినిమా తెరకెక్కిస్తున్నారు.

1 / 5
.ఒక్కరో ఇద్దరో కాదు.. ఇప్పుడందరూ అదే దారిలో వెళ్తున్నారు. టాలీవుడ్‌లో ఇదే ట్రెండ్ అయిపోయిందిప్పుడు. ఈ రోజుల్లో పెద్ద సినిమా అంటే మినిమమ్ 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత బడ్జెట్ పెడుతున్నపుడు ఫోకస్ కూడా దానిపైనే పెడతారు.

2 / 5
కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యమైతే మరో ఆప్షన్ చూసుకోక తప్పదు. కొందరు దర్శకులు ఇదే చేస్తున్నారిప్పుడు. ఈ క్రమంలోనే ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమా చేస్తున్నారు. తాజాగా గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ వర్మ, క్రిష్ లాంటి దర్శకులు ఇదే చేస్తున్నారు.

3 / 5
పొన్నియన్ సెల్వన్‌లో చిన్నప్పటి ఐశ్వర్యా రాయ్ పాత్రలో నటించిన సారా అర్జున్ కీలక పాత్రలో ఓటిటి కోసం ఓ హై స్కూల్ రొమాన్స్ డ్రామా తెరకెక్కిస్తున్నారు గౌతమ్. ఫ్యామిలీ స్టార్‌కి బల్క్ డేట్స్ ఇవ్వడంతో.. ఈ గ్యాప్‌లో గౌతమ్ మరో సినిమాకే షిఫ్ట్ అయిపోయారు. లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ సైతం హనుమాన్ చేస్తూనే ఓ చిన్న సినిమా సైలెంట్‌గా పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

4 / 5
హరిహర వీరమల్లుకు పవన్ డేట్స్ ఇవ్వనపుడు.. కేవలం 40 రోజుల్లోనే వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం తెరకెక్కించారు. ఇప్పుడు మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఆలస్యం కారణంగా.. రవితేజతో ఈ మధ్యే మిస్టర్ బచ్చన్ మొదలుపెట్టారు హరీష్ శంకర్. మొత్తానికి పెద్ద సినిమా చేస్తూనే.. మధ్యలో గ్యాప్ దొరికినపుడు మరో సినిమా చేస్తున్నారు మన దర్శకులు. .

5 / 5
Follow us