AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు..

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హాజరుకానున్నారు. ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు.

YS Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు..
Ys Raja Reddy
Srikar T
|

Updated on: Jan 18, 2024 | 8:30 AM

Share

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హాజరుకానున్నారు. ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ శుభకార్యానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లను కలిసి వివాహానికి హాజరు కావల్సిందిగా శుభలేఖ అందజేశారు వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈనెల 21న ఏపీసీసీ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఈ శుభకార్యం జరగడంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదిక కానుంది.

ఇదిలా ఉంటే నూతన సంవత్సరం సందర్బంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ తన ఇంట జరిగే శుభకార్యాన్ని ప్రజలందరితో పంచుకున్నారు వైఎస్ షర్మిల. తన కుమారుడు వైఎస్ రాజా రెడ్డికి అట్లూరి ప్రియాతో 2024 జనవరి 18న నిశ్చితార్థం వేడుక జరుగనున్నట్లు వెల్లడించారు. అలాగే 2024 ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు. జనవరి 2న ఇడుపులపాయకు వెళ్లి తొలి ఆహ్వాన పత్రిక వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక వైఎస్ రాజా రెడ్డి విషయానికొస్తే.. యూఎస్‎లో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించారు. గతంలో వీరిద్దరు కలిసున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‎గా మారింది. అంతే కాకుండా వైఎస్ విజయమ్మ ప్రియా అట్లూరికి చీర పెట్టిన ఫొటో బయటకు రావడంతో వీళ్ల పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లైంది. ఆ తరువాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎప్పుడు పెళ్లి చేయాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తేదీలను ప్రకటించారు షర్మిల. దీంతో రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్టు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్‎ వీరిద్దరి పెళ్లికి వేదిక కానున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..