Telangana: భూకబ్జాదారులపై ఉక్కుపాదం.. పోలిసుల అదుపులో కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్..

భూదందాలకు సంబంధించిన ఘటనల్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో పోలీసు విభాగానికి చెందిన అధికారులు ఏం చేశారన్న కోణంలో కూడా సిట్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఫిర్యాదు చేసిన ఎదో ఒక వంక చూపించి బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల నుంచి వివరాలు తీసుకున్న తరువాత సదరు అధికారులు ఏలాంటి చర్యలకు పూనుకున్నారు. నిందితుల పక్షాన ఏ విధంగా నిలిచారు అన్న విషయాలను తెలుసుకుంటున్నట్టు సమాచారం.

Telangana: భూకబ్జాదారులపై ఉక్కుపాదం.. పోలిసుల అదుపులో కార్పొరేటర్, మాజీ కౌన్సిలర్..
Telangana Land
Follow us

| Edited By: Venkata Chari

Updated on: Jan 17, 2024 | 8:16 PM

Telangana: భూ దందాగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టే పనికి శ్రీకారం చుట్టారు కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు. కరీంనగర్‌లో వేళ్లూనుకున్న అక్రమార్కులపై కొరడా ఝులిపించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇందు కోసం ఏర్పాటు చేసిన ‘సిట్’ కార్య రంగంలోకి దిగింది. సిట్ చేపట్టిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసులో ఇద్దరి అరెస్ట్ జరగడంతో కరీంనగర్ అక్రమార్కుల్లో దడ మొదలైంది. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, చీటీ రామారావులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిమ్మశెట్టి శ్యాం అనే మరో వ్యక్తిపైనా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలోనే సంచలన కేసు..

కరీంనగర్ భగత్ నగర్‌లోని కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూమి విషయంలో చీటి రామారావుతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకుని తనను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆరోపించారు. బాధితుని ఆరోపణలపై అప్పటి అధికారులు నిందితులపై చర్యలు తీసుకోవడంలో మీనామేషాలు లెక్కించారు. ఈ వ్యవహారంపై తనకు న్యాయం చేయాలంటూ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితుడు రాజిరెడ్డి మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కలిసి బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించాడు. దీంతో ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పోలీసు అధికారులు బీఆర్ఎస్ కార్పోరేటర్ తోట రాములు, చీటి రామారావు, నిమ్మశెట్టి శ్యాంలపై ఐపీసీ సెక్షన్ 447, 427 r/w 34లలో కేసు నమోదు చేశారు. ఇందులో కార్పోరేటర్ తోట రాములు, చీటి రామారావులను బుధవారం అరెస్ట్ చేసినట్టు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

లోతుగా దర్యాప్తు.. 

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన భూ దందాల విషయంలో పోలీసులు ఫిర్యాదు రాగానే హాడావుడిగా కేసులు నమోదు చేయడం లేదు. బాధితులు ఇచ్చిన ఆధారాలను క్షుణ్నంగా పరిశీలించి, అక్రమార్కులు ఏ విధంగా బలయ్యారు అన్న వివరాలను సేకరిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఆధారాలను క్రాస్ చెక్ చేసుకుని సరైనవేనని నిర్థారించుకున్న తరువాతే క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు.

శాఖాపరంగానూ  ఆరా..

భూదందాలకు సంబంధించిన ఘటనల్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల విషయంలో పోలీసు విభాగానికి చెందిన అధికారులు ఏం చేశారన్న కోణంలో కూడా సిట్ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. గతంలో ఫిర్యాదు చేసిన ఎదో ఒక వంక చూపించి బాధితులకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. బాధితుల నుంచి వివరాలు తీసుకున్న తరువాత సదరు అధికారులు ఏలాంటి చర్యలకు పూనుకున్నారు. నిందితుల పక్షాన ఏ విధంగా నిలిచారు అన్న విషయాలను తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా శాఖాపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు అక్రమాలకు పాల్పడిన వారిని, ఇటు వారికి కొమ్ము కాసిన అధికార యంత్రాంగాన్ని కూడా బాధ్యులను చేసినట్టయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..