YS Sharmila Invites Pawan: జనసేన అధినేత పవన్‌ను కలిసిన వైఎస్‌ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం (జనవరి 17) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని కోరూత ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా పవన్‌ కాబోయే నూతన జంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి షర్మిలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలపై..

YS Sharmila Invites Pawan: జనసేన అధినేత పవన్‌ను కలిసిన వైఎస్‌ షర్మిల.. కుమారుడి పెళ్లికి ఆహ్వానం
YS Sharmila Invites Pawan
Follow us

|

Updated on: Jan 17, 2024 | 8:42 PM

హైదరాబాద్‌, జనవరి 17: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బుధవారం (జనవరి 17) జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని కోరూత ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా పవన్‌ కాబోయే నూతన జంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి షర్మిలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలపై పవన్, షర్మిల కాసేపు చర్చించుకున్నారు.

కాగా త్వరలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షర్మిల కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. జనవరి 18న హైదరాబాద్‌లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్‌లో జరగనున్న రాజారెడ్డి వివాహ నిశ్చితార్ధం వేడుకకు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది. ఈ క్రమంలో షర్మిల రాజకీయాలకు అతీతంగా పలువురు రాజకీయ నేతలను, వ్యాపారవేత్తలను కలిసి నిశ్చితార్ధంతోపాటు పెళ్లి, రిసెప్షన్‌కి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే అన్న వైఎస్‌ జగన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించింది. ఆయన రేపు జరగబోయే ఎంగేజ్‌మెంట్‌కు కూడా హాజరవుతున్నారని సమాచారం. ఈ వేడుకకు వైఎస్‌ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గవర్నర్ తమిళిసై, మాజీ మంత్రి హరీశ్ రావు, నారా లోకేష్‌, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వైఎస్సార్ మరణం తరువాత ఆ కుటుంబలో జరుగుతున్న తొలి శుభకార్యం కావటంతో సర్వాత్రా ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.