KCR: కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కర్ర సాయంతో నడుస్తున్న వీడియో వైరల్..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటున్నారు. హిప్ రిప్లేస్‌మెంట్ (తుంటి ఎముక మార్పిడి) శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోటుకుంటున్నారు. హిప్ రిప్లేస్‌మెంట్ (తుంటి ఎముక మార్పిడి) శస్త్రచికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత ముందుగా హైదరాబాద్ నందినగర్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, సహాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఊత కర్ర సాయంతో నడుస్తున్నారు. అయితే, సర్జరీ నాటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కెసిఆర్ నడుస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేశారు. మరింత దృఢ సంకల్పంతో కేసీఆర్ త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన చేశారు.
వీడియో చూడండి..
కాగా.. కేసీఆర్‌కు శాస్త్ర చికిత్స నాటి నుంచి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.. పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా.. సమీక్షా సమావేశాలు నిర్వహించి.. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల నాటికి.. కేసీఆర్ పూర్తిగా కోలుకుని.. ప్రజా క్షేత్రంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడినుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..