AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏకంగా పోలీస్ బైక్‌పైనే ట్రిపుల్ రైడింగ్ .. పోకిరీల కొత్త స్టంట్..

పోలీస్ నెంబర్ ప్లేట్ ఉపయోగించి వాహనం నడిపిన యువకుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ నంబర్ పై ఎలాంటి చలాన్లు లేకపోవడం గమనర్హం. సాధారణ ప్రజలు ఈ విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తీసుకునే పోలీసులు మరి పోలీస్ వాహనం ఉపయోగించి ట్రిపుల్ రైడ్ చేసిన వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ పలువురు నెట్టిజనులు ప్రశ్నిస్తున్నారు.

Hyderabad: ఏకంగా పోలీస్ బైక్‌పైనే ట్రిపుల్ రైడింగ్ .. పోకిరీల కొత్త స్టంట్..
Triple Riding
Vijay Saatha
| Edited By: Venkata Chari|

Updated on: Jan 17, 2024 | 7:40 PM

Share

Hyderabad Police: హైదరాబాదులో కొంతమంది పోకిరీలు ఏకంగా పోలీస్ బైక్‌లను వాడుతున్నారు. పోలీస్ బైక్ కలిగిన నంబర్ ప్లేట్‌ను ఉపయోగిస్తూ ట్రిపుల్ రైడింగ్‌కి పాల్పడుతున్నారు పలువురు పోకిరిలు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల కోసం ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఇచ్చింది. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు పోలీస్ స్టేషన్ పరంగా వాహనాలను కేటాయించారు. ఎస్సై స్థాయి అధికారుల వరకు టూ వీలర్ వాహనాలను గత ప్రభుత్వం అందించింది. అయితే పోలీసులకు ఇచ్చిన వాహనాలను వారి సన్నిహితులు దుర్వినియోగానికి పాల్పడుతున్న ఘటనలు చేసుకుంటున్నాయి.

తాజాగా ఒక పోలీస్ నెంబర్ ప్లేట్ కలిగిన టు వీలర్ వాహనం హైదరాబాద్ వీధుల్లో చక్కెర కొట్టింది. TS09 PA నంబర్ ప్లేట్ కలిగిన వాహనం కేవలం పోలీసులకు మాత్రమే ఉంటుంది. సాధారణ పోలీస్ సిబ్బంది నుంచి మొదలుకొని డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఈ ఫార్మేట్ లోనే నెంబర్ ప్లేట్ కేటాయించబడుతుంది. అయితే, సంక్రాంతి పండుగ రోజు TS 09 PA 9909 నంబర్ ప్లేట్ కలిగిన వాహనం సికింద్రాబాద్ పరిసరాల్లో కనిపించింది. వాహనంపై ముగ్గురు యువకులు రైడింగ్ చేస్తూ హైదరాబాద్ రోడ్లపై హంగామా చేశారు. ఇందులో వాహనం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ ధరించగా వెనకాల కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదకర స్థితిలో కూర్చుని బైక్ పై వెళ్తున్నారు.

అయితే, గతంలోని పోలీస్ ఇన్నోవా వాహనాలలో తన కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్న కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి ఇన్నోవా వాహనం ఉంటుంది. తమ సొంత పనులకు వాహనాలను ఉపయోగిస్తున్నారని గతంలోనూ పలు విమర్శలు వచ్చాయి. తాజాగా టూవీలర్ వాహనాలను సైతం పలువురు పోలీసులు దుర్వినియోగపరుస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు వాహనాన్ని ఇవ్వటమే కాకుండా ఆ వాహనంపై ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

పోలీస్ నెంబర్ ప్లేట్ ఉపయోగించి వాహనం నడిపిన యువకుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ నంబర్ పై ఎలాంటి చలాన్లు లేకపోవడం గమనర్హం. సాధారణ ప్రజలు ఈ విధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తే చర్యలు తీసుకునే పోలీసులు మరి పోలీస్ వాహనం ఉపయోగించి ట్రిపుల్ రైడ్ చేసిన వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అంటూ పలువురు నెట్టిజనులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..