Nizamabad: నిజామాబాద్ నుంచి క్యాబినేట్ మంత్రి ఆయనేనా? ఒక్క ఎమ్మెల్సీతో ఇద్దరు మాజీ మంత్రులకు చెక్
నిజామాబాద్ పాలిటిక్స్ ఒక్కసారిగా ఊహించని టర్న్ తీసుకున్నాయి. నిన్నటి వరకు నువ్వా నేనా అని సాగిన పోటి అంత ఇప్పుడు త్రిముఖ పోటిగా మారింది. అసలు ఎమ్మెల్సీ లిస్ట్ లో పేరే లేని మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం తన పేరును ప్రకటించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు
నిజామాబాద్ పాలిటిక్స్ ఒక్కసారిగా ఊహించని టర్న్ తీసుకున్నాయి. నిన్నటి వరకు నువ్వా నేనా అని సాగిన పోటి అంత ఇప్పుడు త్రిముఖ పోటిగా మారింది. అసలు ఎమ్మెల్సీ లిస్ట్ లో పేరే లేని మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం తన పేరును ప్రకటించేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇవాళ్ల నామినేషన్ కూడ వేయడంతో ఇప్పటికే వేడి గా ఉన్న నిజామాబాద్ పాలిటిక్స్ ఇంకా వేడేక్కతున్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విధేయతను ఎట్టాకేలాకు కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించింది. ఆయనను శాసనమండలికి పంపాలని నిర్ణయించింది. ఈ నెల 29న జరిగే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది. కాంగ్రెస్ అధిష్టానం పోటీకి నిలిపే ఇద్దరు అభ్యర్థుల విషయంలో మంగళవారమే నిర్ణయం తీసుకుంది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ కు ఢిల్లీ నేతల నుంచి ఈ మేరకు ఫోన్లో సమాచారం కూడా ఇచ్చారని చెప్పారు. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. వీరిద్దరు బుధవారమే నామినేషన్లు వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, బుధవారం మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల అధికారిక ప్రకటన వెలువడింది. అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరు ఉంది. ఈ మార్పునకు కారణాలు చాల బలంగా ఉన్నాయనే టాక్ కాంగ్రెస్ పార్టీ లో నడుస్తుంది.
క్యాబినేట్ బెర్త్ ఆయన కోసమే ఆపారా..?
ఇక మహేష్ కుమార్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు జిల్లాలో కొత్త చర్చ మొదలయింది. జిల్లా నుండి ఇప్పటి వరకు ఎవరికీ క్యాబినేట్ లో చోటు దక్కలేదు. ఇక రెండో విడతలోనే ఆశలు పెట్టుకున్నారు.. వీరిలో నిజామాబాద్ అర్బన్ నుండి పోటి చేసి ఓటమి పాలయిన మాజి మంత్రి షబ్బీర్ ఆలీ తనకు క్యాబినేట్ బెర్తు ఖాయమని ధీమాతో ఉన్నారు. తన కామారెడ్డి సీటు త్యాగం చేయడంతో తనకు గెలిచిన ఓడిన ఎమ్మెల్సి ఇచ్చి మంత్రిని చేస్తారు అని ఆశించారు. మైనారీటి కోటాలో ఇంకా బెర్త్ పక్కా అనుకున్నారు కారీ ఆ ప్రస్తావన కూడ ఎక్కడా రావడం లేదు. ఇక బోధన్ నుండి గెలిచిన సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు.. 2009 – 2014 వరకు మంత్రి గా పనిచేసిన సుదర్శన్ రెడ్డి జిల్లా లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీని బ్రతికించడంలో కీలక పాత్ర పోషించారు.. కాని మొదటి క్యాబినేట్ లో చోటు దక్కలేదు. స్పీకర్ మొదట సుదర్శన్ రెడ్డికి ఇచ్చిన దాన్ని ఆయన తిరస్కరించి ఇస్తే మంత్రి పదవి లేదంటే ఖాళీగా ఉంటా అని చెప్పారట. దీంతో అది కాస్తా వెయిటింగ్ లిస్ట్ లో పడింది. ఇప్పుడు సీన్ లోకి మహేష్ రావడంతో నిజామాబాద్ పాలిటిక్స్ ఇంకా హీటేక్కిస్తున్నాయి.
పరిచయాలతో బెర్తు కొట్టేస్తారా?
ఇక మహేష్ ఏంట్రీ తో ఇద్దరు సీనియర్లకు కోంత టఫ్ టైం అనే టాక్ నడుస్తుంది. నిజామాబాద్ లో ఖాళీ క్యాబినేట్ స్థానాన్ని మహేష్ తో భర్తి చేస్తారు అనే టాక్ బలంగా ఉంది. సుదర్శన్ రెడ్డి ఇది వరకే మంత్రిగా చేయడం, దానితో పాటు రెడ్డి సామాజిక వర్గం నుండి ఇప్పటికే చాల మంది మంత్రులు క్యాబినేట్ లో ఉండటంతో మహేష్ వైపు హైకమాండ్ చూసే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ కు సన్నిహితుడు అనే పేరుంది. దీనితో ఏ రకంగా చూసిన మహేష్ కు బెర్త్ ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. ఇక మహేష్ ఎన్ఎస్‌యూఐ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్య క్షుడిగా పని చేశారు. యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగాపీసీసీ కార్యదర్శిగా పని చేశారు. పీసీసీ అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధానకార్యదర్శిగా పని చేసి ప్రస్తుతం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో ఏఐసిసి లెవెల్‌లో కూడా మహేష్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీటిని బట్టి మహేష్ ను క్యాబినేట్ లోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…