Hanuman OTT: థియేటర్లలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. ఓటీటీలోకి ఆలస్యంగా హనుమాన్.. స్ట్రీమింగ్ అప్పుడే
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి
సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సూపర్ హీరో మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు హిందీలోనూ తేజ సజ్జా సినిమాకు అదిరిపోయే వసూళ్ల వస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఈజీగా రూ.150 కోట్లను రాబట్టే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హనుమాన్ ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. లుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ రైట్స్ కలిపి దాదాపు 30 కోట్లకు జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే హనుమాన్ సినిమా ఓటీటీ డీల్ కుదరిందట. నిబంధనల ప్రకారం థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా హనుమాన్ నిర్మాతలు జీ5తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. దీని ప్రకారం ఫిబ్రవరి మూడో వారంలో హనుమాన్ సినిమాను స్ట్రీమింగ్ చేయాలని భావించారట.
అయితే హనుమాన్ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అనుకున్నదాని కంటే మరింత ఆలస్యంగా ఈ సూపర్ హీరో మూవీని ఓటీలోకి తీసుకొచ్చే అవకాశం ఉందట. సుమారు రెండు నెలల తర్వాతే హనుమాన్ ఓటీటీలో రిలీజ్ చేయాలని జీ5 సంస్థను నిర్మాతలు కోరారట. అంటే మార్చి ఆఖరి వారంలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ ఉండనుందట. సో ఇప్పటికప్పుడు ఓటీటీలో హనుమాన్ రిలీజయ్యే ఛాన్స్ లేదు.. కాబట్టి థియేటర్లలోనే ఈ సూపర్ హిట్ మూవీని ఆస్వాదించడం మేలు.
తేజ సజ్జాతో కన్నడ సూపర్ స్టార్ శివన్న..
ಹನುಮಾನ್ ಮೀಟ್ಸ್ ಭಜರಂಗಿ ❤️@NimmaShivanna sir Thank you for all your kind words sir ಧನ್ಯವಾದಗಳು ಶಿವಣ್ಣ ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗೆ
ಸಿನಿಮಾ ಗೆಲ್ಲಿಸಿದ ಕನ್ನಡ ಜನತೆಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.. ಜೈ ಹನುಮಾನ್ ⛳#HanuMan pic.twitter.com/QNuEyE28Mz
— Teja Sajja (@tejasajja123) January 17, 2024
It’s #HanuMania everywhere: from North to South, from East to West… #HanuMan is UNSTOPPABLE and UNSHAKABLE… Continues its victory march on make-or-break Day 4 [Mon]… Collects *more* than Day 1 [Fri], despite reduced ticket rates *on weekdays*… This one’s NOT going to slow… pic.twitter.com/IGjpcEzCWT
— taran adarsh (@taran_adarsh) January 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.