AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirzapur3 OTT: గుడ్డు భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు.. ‘మీర్జాపూర్‌ 3’ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఓటీటీ ఆడియెన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. గుడ్డూ భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు. అదేనండి.. సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జా పూర్‌. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ మూడో సీజన్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ 3 ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు జరుపుకొంటోందట. అన్నీ సవ్యంగా కుదిరితే..

Mirzapur3 OTT: గుడ్డు భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు.. 'మీర్జాపూర్‌ 3' స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
Mirzapur3 Web Series
Basha Shek
|

Updated on: Jan 17, 2024 | 1:57 PM

Share

ఓటీటీ ఆడియెన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. గుడ్డూ భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు. అదేనండి.. సూపర్‌ హిట్‌ వెబ్‌ సిరీస్‌ మీర్జా పూర్‌. ఇప్పటికే సక్సెస్‌ ఫుల్‌ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ మూడో సీజన్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న మీర్జాపూర్‌ 3 ఇప్పుడు పోస్ట్‌ ప్రొడక్షన్‌, డబ్బింగ్‌ పనులు జరుపుకొంటోందట. అన్నీ సవ్యంగా కుదిరితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మీర్జా పూర్‌ సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ కానుందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్‌ రెడీ అవుతున్నారట. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నగరం నేపథ్యంలో క్రైమ్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ సిరీస్‌గా ఇది తెరకెక్కింది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2018 నవంబరు 16న మీర్జాపూర్‌ మొదటి సీజన్‌ రిలీజ్‌ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఇండియాలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న వెబ్‌ సిరీస్ లలో ఒకటిగా నిలిచిఇంది. ఇక దీనిక సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న మీర్జాపూర్‌ రెండో సీజన్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ఇది మొదటి పార్ట్‌కు మించి రెస్పాన్స్‌ తెచ్చుకుంది. దీంతో మీర్జాపూర్‌ మూడో సీజన్‌ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీర్జాపూర్‌ సిరీస్‌లాగే అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా బాగా ఫేమస్‌. ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా, బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే మోతాదుకు మించి హింస, రొమాన్స్‌ ఉండడం మీర్జాపూర్‌ సిరీస్‌లో ప్రతికూలాంశం. ఇక మొదటి సీజన్‌లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలు బాగా ఇబ్బంది పెట్టడం చూపించారు. అదే రెండో సీజన్‌ లో మున్నాపై గుడ్డూ రివేంజ్‌ తీర్చుకున్నాడో చూపించారు. ఇక మూడో పార్ట్‌ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నా ప్రియుడు విజయ్‌ వర్మ ఒక కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి