Mahesh Babu: గుంటూరు కారం టీమ్‌కి సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చిన మహేశ్‌ .. ఫొటోలు చూశారా? వారిద్దరూ మిస్సింగ్‌

గుంటూరు కారం మెల్లి మెల్లిగా తన ఘాటును రుచి చూపిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్షన్‌ లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన ఈ మాస్‌ మసాలా ఎంటర్‌ టైన్‌ వసూళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మిక్స్‌డ్‌ టాక్‌ నడుస్తోన్నా మహేశ్‌ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి

Mahesh Babu: గుంటూరు కారం టీమ్‌కి సంక్రాంతి ట్రీట్‌ ఇచ్చిన మహేశ్‌ .. ఫొటోలు చూశారా? వారిద్దరూ మిస్సింగ్‌
Guntur Kaaram Success Party
Follow us
Basha Shek

|

Updated on: Jan 16, 2024 | 12:43 PM

గుంటూరు కారం మెల్లి మెల్లిగా తన ఘాటును రుచి చూపిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్షన్‌ లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన ఈ మాస్‌ మసాలా ఎంటర్‌ టైన్‌ వసూళ్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మిక్స్‌డ్‌ టాక్‌ నడుస్తోన్నా మహేశ్‌ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన గుంటూరు కారం మూడు రోజుల్లోనే రూ. 164 కోట్లు రాబట్టింది. దీంతో గుంటూరు కారం చిత్ర బృందమంతా సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్‌లోని త‌న ఇంట్లో గుంటూరు కారం స‌క్సెస్ పార్టీ ఇచ్చాడు హీరో మ‌హేశ్‌ బాబే. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి, దిల్ రాజు, నాగ‌వంశీ . మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార తదితరులు ఈ పార్టీలో తళుక్కుమన్నారు.ఫ్రెండ్స్‌, సన్నిహితులు కూడా ఈ పార్టీలో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు మహేశ్‌ బాబు. పార్టీకి హాజరైన సెలబ్రిటీలందరూ సంప్రదాయ దుస్తుల్లో మెరవడం విశేషం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్‌ పార్టీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంత బాగానే ఉంది కానీ.. ఈ పార్టీలో డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సంగీత దర్శకుడు తమన్‌ కనిపించలేదు. దీంతో ఆ ఇద్దరు ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.కాగా హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, ప్రకాశ్‌ రాజ్‌, జయరాం, రఘుబాబు, రావు రమేశ్, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

మహేశ్ సంక్రాంతి పార్టీలో గుంటూరు కారం టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.