Hanuman Collections: మూడో రోజు మరింతగా పెరిగిన హనుమాన్‌ కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

తెలుగుతో పాటు నార్త్‌లోనూ ముఖ్యంగా హిందీలోనూ హనుమాన్‌ భారీ వసూళ్లు వస్తుండడం విశేషం. ఆదివారం (జనవరి 15) అన్ని భాషల్లో కలిపి రూ. 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్‌. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులు కలిపి..

Hanuman Collections: మూడో రోజు మరింతగా పెరిగిన హనుమాన్‌ కలెక్షన్లు.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
Hanuman Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 12:24 PM

హనుమాన్‌ మూవీ దూసుకుపోతోంది. ప్రీమియర్‌ షోల నుంచే మొదలైన ఈ మూవీ హడావిడీ క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలున్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్‌ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్‌ కలెక్షన్లు మరింతగా పెరగడం విశేషం. తెలుగుతో పాటు నార్త్‌లోనూ ముఖ్యంగా హిందీలోనూ హనుమాన్‌ భారీ వసూళ్లు వస్తుండడం విశేషం. ఆదివారం (జనవరి 15) అన్ని భాషల్లో కలిపి రూ. 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్‌. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులు కలిపి మొత్తం రూ.66 కోట్ల వరకు వసూలు చేసినట్లయింది. ఇందులో ఒక్క మన దేశంలోనే రూ. 42 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ. 29 కోట్ల రాబట్డం విశేషం. ఆ తర్వాత హిందీలో రూ. 13 కోట్లు వచ్చినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం హనుమాన్‌ సినిమాకు పెద్దగా బజ్ లేదు.

ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ లో తేజ సజ్జా హీరోగా నటించాడు. మన దేశంలో సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ తో రూపొందిన మూవీ ఇదే కావడం విశేషం. అమృతా అయ్యర్‌ హీరోయిన్గా నటించిన హనుమాన్‌ మూవీలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరో కీలక పాత్ర పోషించింది. అలాగే వినయ్‌ రాయ్‌ విలన్‌ గా అదరగొట్టాడు. కాగా సరిగ్గా ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కూడా హనుమాన్‌ సినిమాకు మరింత క్రేజ్‌ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అదనపు షోస్..

రెండు రోజుల్లో 10 లక్షల టికెట్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం