AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahaesh Babu: ఇదేం అభిమానం రా అయ్యా? మహేశ్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం.. బ్లేడుతో కోసుకుని మరీ..

సాధారణంగా హీరోలందరికీ అభిమానులు ఉంటారు. అయితే తెలుగు హీరోలకు డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. అదేదో ఠాగూర్‌ సినిమాలో చెప్పినట్లు ఎవరిపైనైనా ఒక్కసారి ఇష్టం పెంచుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు అభిమానులు. ఇదే అభిమానం పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు

Mahaesh Babu: ఇదేం అభిమానం రా అయ్యా? మహేశ్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం.. బ్లేడుతో కోసుకుని మరీ..
Mahaesh Babu
Basha Shek
|

Updated on: Jan 14, 2024 | 5:53 PM

Share

సాధారణంగా హీరోలందరికీ అభిమానులు ఉంటారు. అయితే తెలుగు హీరోలకు డై హార్డ్‌ ఫ్యాన్స్‌ ఉంటారు. అదేదో ఠాగూర్‌ సినిమాలో చెప్పినట్లు ఎవరిపైనైనా ఒక్కసారి ఇష్టం పెంచుకుంటే గుండెల్లో పెట్టి చూసుకుంటారు అభిమానులు. ఇదే అభిమానం పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఇదే వారికే కాక అభిమానులందరికీ చెడ్డ పేరు తీసుకొస్తుంది. సదరు హీరోపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కొన్ని చోట్ల నెగెటివ్‌ టాక్‌ వచ్చినా భారీ వసూళ్లు రాబడుతోంది. గుంటూరు కారం సినిమా రిలీజ్ క్రమంలో అభిమానులు సంబరాలు చసుకున్నారు. మహేశ్‌ ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటుచేసి హీరోపై తమ అభిమానం చాటుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఓ వీరాభిమాని చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు కారం రిలీజ్‌ సందర్భంగా అతను తన చేయిని బ్లేడుతో కోసుకుని మరీ మహేశ్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు మరీ కోసుకుని మరీ మహేశ్‌ ఫ్లెక్సీకి రక్త తిలకం దిద్దాడు. అక్కడున్న కొందరు దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ సదరు వీరాభిమాని చేసిన పనిని అందరూ తిడుతున్నారు. హీరో మహేశ్‌ కు ఇలాంటి పనులు అసలు నచ్చవంటూ హిత బోధ చేస్తున్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన గంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించింది. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, ఈశ్వరి రావు, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ గుంటూరు కారం సినిమాను నిర్మించారు. థమన్ స్వరాలు సమకూర్చాడు. కుర్చీ మడతపెట్టి సాంగ్‌ ఓ రేంజ్ లో సెన్సేషన్‌ సృష్టించింది. థియేటర్లలో అయితే ఈ సాంగ్‌ వచ్చినప్పుడు విజిల్స్ పడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
పైసా ఖర్చు లేకుండా నెలకు రూ.9250 ఆదాయం.. ఈ సూపర్ స్కీమ్..
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..
ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..