- Telugu News Photo Gallery Cinema photos Tollywood Senior Heroines Are in Trouble In 2024, Know Details
కొత్త ఏడాది లో చిక్కుల్లో పడ్డ అందాల భామలు.. టెన్షన్ లో అభిమానులు
కొత్త ఏడాదిని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్న అందాల భామలకు న్యూ ఇయర్ కొత్త చిక్కులను వెంటబెట్టుకొచ్చింది. కొత్త ఏడాదిలో సినిమా క్యాలెండర్ ఓపెన్ అవ్వకముందే వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఈ ఏడాది వీళ్ల ప్యూచర్ ఎలా ఉండబోతుందో అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్, కొత్త ఏడాది మొదట్లోనే పెద్ద కాంట్రవర్సీకి తెర లేపారు మిల్కీ బ్యూటీ తమన్నా. సాధారణంగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్, పాన్ మాసాలా బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసిన ప్రతీసారి వివాదాస్పదమవ్వటం కామన్.
Updated on: Jan 14, 2024 | 5:48 PM

కొత్త ఏడాదిని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్న అందాల భామలకు న్యూ ఇయర్ కొత్త చిక్కులను వెంటబెట్టుకొచ్చింది. కొత్త ఏడాదిలో సినిమా క్యాలెండర్ ఓపెన్ అవ్వకముందే వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో ఈ ఏడాది వీళ్ల ప్యూచర్ ఎలా ఉండబోతుందో అని టెన్షన్ పడుతున్నారు ఫ్యాన్స్,.

కొత్త ఏడాది మొదట్లోనే పెద్ద కాంట్రవర్సీకి తెర లేపారు మిల్కీ బ్యూటీ తమన్నా. సాధారణంగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్, పాన్ మాసాలా బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసిన ప్రతీసారి వివాదాస్పదమవ్వటం కామన్. ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే పడ్డారు తమ్ము.

ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఓ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన యాడ్‌లో నటించారు మిల్కీ బ్యూటీ. ఆ యాడ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు కూడా. ఈ పోస్ట్‌పై నెటిజెన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావటంతో కామెంట్స్ సెక్షన్‌ను డిజెబుల్ చేసేశారు.

రీసెంట్‌గా తెలుగమ్మాయి అంజలి కూడా మీడియా మీద సీరియస్ అయ్యారు. తనని శ్రీలీలతో పోలుస్తూ అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చారు అంజలి. అందరిలా వరుస సినిమాలు చేయటం నాకు ఇష్టం ఉండదు. కథ నచ్చి, నాకిచ్చిన పాత్రకు నేను న్యాయం చేయగలను అంటేనే నేను సినిమా ఒప్పుకుంటా అంటూ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కొత్త ఏడాదిలో వివాదంలో చిక్కుకున్నారు. థియేట్రికల్ రిలీజ్‌లో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా.. ఓటీటీ రిలీజ్‌లో నయన్‌ను చిక్కుల్లోకి నెట్టింది అన్నపూర్ణి సినిమా. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఏకంగా కేసు నమోదైంది.




