AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kadambari Kiran: మరోసారి మానవత్వం చాటుకున్న కాదంబరి కిరణ్‌.. కోమాలో ఉన్న ప్రముఖ నటుడికి ఆర్థిక సాయం

'మనం సైతం ఫౌండేషన్‌' పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారీ సీనియర్‌ నటుడు. కష్టాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు తన వంతు ఆర్థిక సాయం అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. గతంలో ఎందరో సినీ నటుడు, కార్మికులకు ఆర్థిక సాయం చేసిన కాదంబరి కిరణ్‌ ఇటీవల ప్రముఖ సీనియర్‌ నటి పావలా శ్యామలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.

Kadambari Kiran: మరోసారి మానవత్వం చాటుకున్న కాదంబరి కిరణ్‌.. కోమాలో ఉన్న ప్రముఖ నటుడికి ఆర్థిక సాయం
Kadambari Kiran
Basha Shek
|

Updated on: Jan 13, 2024 | 11:36 AM

Share

వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు కాదంబరి కిరణ్‌. ముఖ్యంగా కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. టీవీ షోస్‌లోనూ సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్‌. గతంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యుడిగా కూడా సేవలు అందించారాయాన. ఇక ‘మనం సైతం ఫౌండేషన్‌’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారీ సీనియర్‌ నటుడు. కష్టాల్లో సినీ కార్మికులకు, అభిమానులకు తన వంతు ఆర్థిక సాయం అందజేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. గతంలో ఎందరో సినీ నటుడు, కార్మికులకు ఆర్థిక సాయం చేసిన కాదంబరి కిరణ్‌ ఇటీవల ప్రముఖ సీనియర్‌ నటి పావలా శ్యామలకు రూ.25 వేల చెక్కును అందజేశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న శ్యామలను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆ సాయం చేశారు కిరణ్‌. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. ఒక ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికత్స పొందుతోన్న ప్రముఖ టాలీవుడ్‌ నటుడు వీరభద్రయ్యకు ఆపన్న హస్తం అందించారు. వీర భద్రయ్య ఇటీవలే హైదరాబాద్‌లో ఒక ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కాదంబరి కిరణ్‌ వీరభద్రయ్య ఉంటోన్న గుంటూరుకు వెళ్లారు. అక్కడ వీరభద్రయ్య కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వీర‌భద్రయ్యకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాల‌ను తీర్చేందుకుగానూ రూ.25,000 ఆర్థిక సాయం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్‌ను నటుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

కాదంబరి కిరణ్‌ ఆర్థిక సాయానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు కిరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతంలో కంటే మూవీస్‌ చేయడం బాగా తగ్గించారు కిరణ్‌. గతేడాది విశ్వక్‌ సేన్‌ ధమ్కీ, లవ్యూ రామ్‌ వంటి సినిమాల్లో మాత్రమే కనిపించారు. అయితే రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో కాదంబరి కిరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పావలా శ్యామలను వెతుక్కుంటూ వెళ్లి మరీ..

సినీ కార్మికులకు సాయం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?