Nagarjuna: అప్పుడు నా సినిమాకు ఇదే సమస్య వచ్చింది.. ఇప్పుడూ అదే సమస్య : నాగార్జున
నా సామిరంగ అనే టైటిల్ తో నాగార్జున సినిమా చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కింగ్ నాగార్జున ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్లు,ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్ననయినా, బంగార్రాజు లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న కింగ్ ఇప్పుడు అదే తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నా సామిరంగ అనే టైటిల్ తో నాగార్జున సినిమా చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటి అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే అషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైందవ్ సినిమాలతో పోటీగా నాగార్జున నా సామిరంగ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా గురించి కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా సామిరంగ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘నా సామిరంగ’ సినిమా షూటింగ్ 72 రోజులు జరిగింది. నా పార్ట్ వరకు 60 రోజుల్లో పూర్తి చేశారు. ప్రీ ప్రోడక్షన్ పనులకు మాత్రం 5 నెలల టైం పట్టింది. సినిమాను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనీ అనుకుంటే తప్పులు ఎక్కువ అవుతాయి. కానీ ప్రీప్రోడక్షన్ వర్క్ పక్కాగా చేసుకుంటే ఫాస్ట్ గా చేసెయ్యవచ్చు. పైగా కీరవాణిగారు షూటింగ్‌కి ముందే మూడు పాటలు, ఫైట్ సీక్వెన్స్‌కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేశారు. ఇంత వేగంగా, భారీ బడ్జెట్‌లో సినిమా చేశామంటే దానికి కీరవాణిగారు ఒక కారణం అనే చెప్పాలి అన్నారు నాగార్జున. ఈ సినిమాలో నా ఊతపదం నా సామిరంగ. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడంతో థియేటర్లు దొరకలేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా టైంలోనూ ఇదే సమస్య. ఆ సినిమాను 300 థియేటర్లలో విడుదల చేశాం. ఇప్పుడు ‘నా సామిరంగ’ కూడా 300 థియేటర్లలో విడుదలవుతోంది అన్నారు. అలాగే నా వందవ సినిమా మల్టీస్టారర్ చేయాలని లేదు. అలా అనుకుంటే ‘శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు వచ్చేవి కావు. ఇక వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి. రొటీన్‌గా ఉండటంతో చేయడం లేదు. నాగచైతన్యకి వచ్చిన ‘దూత’ లాంటి కథ కుదిరితే చేస్తాను అన్నారు నాగార్జున.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.