Manchu Manoj-Mahesh Babu: ‘గుంటూరు కారంతో గుంటూరోడు’.. మంచి మనసున్న మహేశ్‌ బాబును కలిశానన్న మంచు మనోజ్‌

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును మంచు మనోజ్‌ కలిశాడు. ఎప్పుడు మీట్‌ అయ్యాడో తెలియదు కానీ మహేశ్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు మనోజ్‌. దీనికి 'గుంటూరు కారంతో గుంటూరోడు' అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడీ టాలీవుడ్ రాక్ స్టార్

Manchu Manoj-Mahesh Babu: 'గుంటూరు కారంతో గుంటూరోడు'.. మంచి మనసున్న మహేశ్‌ బాబును కలిశానన్న మంచు మనోజ్‌
Manchu Manoj, Mahesh Babu
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jan 13, 2024 | 9:28 AM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబును మంచు మనోజ్‌ కలిశాడు. ఎప్పుడు మీట్‌ అయ్యాడో తెలియదు కానీ మహేశ్‌తో కలిసున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు మనోజ్‌. దీనికి ‘గుంటూరు కారంతో గుంటూరోడు’ అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడీ టాలీవుడ్ రాక్ స్టార్ . ‘మంచి మనసున్న మహేశ్‌ బాబును కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. గుంటూరు కారం సినిమా బ్లాక్ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా. మాస్టర్‌ మైండ్‌ త్రివిక్రమ్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా ఆల్‌ ది బెస్ట్‌. రమణ గాడి బాక్సాఫీస్‌ మ్యాజిక్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు మంచు మనోజ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ‘గుంటూరోడు’ అంటూ సేమ్‌ టు సేమ్‌ ఇలాంటి టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మంచు మనోజ్‌. 2017లో రిలీజైన ఈ మాస్‌ మూవీలో ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరోడు పెద్దగా ఆడలేదు.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న గుంటురు కారం శుక్రవారం (జనవరి 12)న గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి షోతోనే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. మహేశ్‌ ఎనర్జీ, శ్రీలీల డ్యాన్సులు, త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ గుంటూరు కారం సినిమాకు హైలెట్‌గా నిలిచాయంటున్నారు ఫ్యాన్స్‌. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకెండ్‌ హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, మురళీ శర్మ, జగపతిబాబు, బ్రహ్మాజీ, అజయ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సునీల్‌ తదితరులు గుంటూరు కారంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబుతో మంచు మనోజ్

హనుమాన్ బ్లాక్ బస్టర్ అవ్వాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!