Pallavi Prashanth: ‘నేను చనిపోయేంతవరకు మీరే నా అన్న’.. శివాజీకి పల్లవి ప్రశాంత్‌ సంక్రాంతి పట్టు బట్టలు

తాజాగా ఓ టీవీ షో వేదికపై బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ అందరూ సందడి చేశారు. ముఖ్యంగా హౌజ్‌లో SPY బ్యాచ్‌కు చెందిన శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌ , అలాగే SPA బ్యాచ్‌లోని శోభా శెట్టి, ప్రియాంక, అమర్‌ దీప్‌ ఈ టీవీ షోలో తళుక్కుమున్నారు. అలాగే టేస్టీ తేజా, అంబటి అర్జున్‌ కూడా హాజరయ్యారు. నా సామిరంగ ప్రమోషన్లలో భాగంగా బిగ్‌ బాస్ హోస్ట్‌ నాగార్జున కూడా ఇదే వేదికపైకి వచ్చారు.

Pallavi Prashanth: 'నేను చనిపోయేంతవరకు మీరే నా అన్న'.. శివాజీకి పల్లవి ప్రశాంత్‌ సంక్రాంతి పట్టు బట్టలు
Pallavi Prashanth, Shivaji
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2024 | 9:38 AM

బిగ్‌ బాస్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌, నటుడు శివాజీల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎంతో కలివిడిగా ఉన్న వీరిద్దరూ హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అలాగే మెలుగుతున్నారు. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. ముఖ్యంగా శివాజీపై తరచూ తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు పల్లవి ప్రశాంత్‌. తాజాగా ఓ టీవీ షో వేదికపై బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ అందరూ సందడి చేశారు. ముఖ్యంగా హౌజ్‌లో SPY బ్యాచ్‌కు చెందిన శివాజీ, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌ , అలాగే SPA బ్యాచ్‌లోని శోభా శెట్టి, ప్రియాంక, అమర్‌ దీప్‌ ఈ టీవీ షోలో తళుక్కుమున్నారు. అలాగే టేస్టీ తేజా, అంబటి అర్జున్‌ కూడా హాజరయ్యారు. నా సామిరంగ ప్రమోషన్లలో భాగంగా బిగ్‌ బాస్ హోస్ట్‌ నాగార్జున కూడా ఇదే వేదికపైకి వచ్చారు. దీంతో సంక్రాంతి స్పెషల్ ఈవెంట్‌ కాస్తా బిగ్‌ బాస్‌ ఈవెంట్‌ లా మారిపోయింది.

ఈ సందర్భంగా తన పెర్ఫామెన్స్‌ తో రైతుల కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు పల్లవి ప్రశాంత్‌. చాలామంది దీనిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ విజేతగా నిలవడంపై స్పందిస్తూ.. ‘ శివాజీ అన్న ఎంకరేజ్‌మెంట్‌తోనే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాను. నాకు అన్న లేడు కానీ, నేను చనిపోయేంత వరకు ఆయనే నా అన్న’ అంటూ శివాజీని ఆకాశానికెత్తేశాడు పల్లవి ప్రశాంత్‌. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా శివాజీకి పట్టు బట్టలు కూడా బహూకరించాడు రైతు బిడ్డ. అలాగే ప్రిన్స్ యావర్‌ కూడా శివాజీకి బంగారు కడియాన్ని తొడిగి ‘ మీరే నా బ్రదర్స్‌, ఫాదర్‌, మదర్‌’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

శివాజీ కి అభినందనలు తెలిపిన పల్లవి ప్రశాంత్..

శివాజీ, ప్రిన్స్ లతో పల్లవి ప్రశాంత్..

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..