Anjali: నాకే తెలియకుండా నా పెళ్లి చేసేస్తున్నారు.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో నటిస్తుంది అంజలి. ఈ మధ్యకాలంలో అంజలీ తెలుగులో సినిమాలు తగ్గించారు. ఇప్పుడు మరోసారి తెలుగులో నటిస్తుంది అంజలి. అంజలి నటించిన గీతాంజలి సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

Anjali: నాకే తెలియకుండా నా పెళ్లి చేసేస్తున్నారు.. అంజలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Anjali
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 12, 2024 | 8:49 AM

తెలుగుగమ్మాయి అంజలి తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తున్నారు. తమిళ్ సినిమాతోనే పరిచయం అయిన అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరో వైపు కీలక పాత్రల్లో నటిస్తుంది అంజలి. ఈ మధ్యకాలంలో అంజలీ తెలుగులో సినిమాలు తగ్గించారు. ఇప్పుడు మరోసారి తెలుగులో నటిస్తుంది అంజలి. అంజలి నటించిన గీతాంజలి సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. గీతాంజలి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అంజలి. ఇటీవలే ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టి సినిమా వివరాలు తెలిపారు చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఓ హీరోతో లవ్ ట్రాక్ నడిపింది వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి అంజలి పెళ్లిగురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంజలి ఇప్పటికే పెళ్లి చేసేసుకుందని .. విషయాన్నీ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడిందని టాక్ వినిపిస్తుంది. సైలెంట్ గా అంజలి పెళ్లి జరిగిపోయిందని.ఓ బిజినెస్ మ్యాన్ ను అంజలి పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యిందని కూడా వార్తలు వచ్చాయి.

ఈ వార్తల పై అంజలి స్పందించింది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ. దేని పై క్లారిటీ ఇచ్చింది. నా పెళ్లి పై ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. అప్పట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. ఇవన్నీ వింటుంటే నాకు నవ్వొస్తుంది అని అంటుంది అంజలి. నాకే తెలియకుండా నా పెళ్లి చేస్తున్నారు అని చెప్పుకొచ్చింది అంజలి.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.