Nithin: షూటింగ్‌లో యాక్సిడెంట్.! హీరో నితిన్‌కు గాయాలు.. నిలిచిపోయిన షూటింగ్.

Nithin: షూటింగ్‌లో యాక్సిడెంట్.! హీరో నితిన్‌కు గాయాలు.. నిలిచిపోయిన షూటింగ్.

Anil kumar poka

|

Updated on: Jan 12, 2024 | 8:13 AM

యాక్షన్ ఎపిసోడ్స్‌.. రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నప్పుడు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. హీరోలు ప్రమాదానికి గురవుతుంటారు. గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు నితిన్ కూడా.. అలాంటి పనే చేస్తూ.. గాయాలపాలయ్యారట. రీసెంట్‌గా.. ఎక్స్‌ ఆర్డినరీ మ్యాన్ సినిమాతో.. తన ఫ్యాన్స్‌ను డిస్సపాయింట్ చేసిన నితిన్... నెక్ట్స్‌ ఎలాగైనా హిట్టు కొట్టాలని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు సినిమా చేస్తున్నారు. షూటింగ్‌లో తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మారేడు మిల్లిలో జరగుతున్న ఈ మూవీ షూట్లో గాయపడ్డారట నితిన్.

యాక్షన్ ఎపిసోడ్స్‌.. రిస్కీ స్టంట్స్‌ చేస్తున్నప్పుడు.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. హీరోలు ప్రమాదానికి గురవుతుంటారు. గాయాల పాలవుతుంటారు. ఇప్పుడు నితిన్ కూడా… అలాంటి పనే చేస్తూ.. గాయాలపాలయ్యారట. రీసెంట్‌గా.. ఎక్స్‌ ఆర్డినరీ మ్యాన్ సినిమాతో.. తన ఫ్యాన్స్‌ను డిస్సపాయింట్ చేసిన నితిన్.. నెక్ట్స్‌ ఎలాగైనా హిట్టు కొట్టాలని వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు సినిమా చేస్తున్నారు. షూటింగ్‌లో తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మారేడు మిల్లిలో జరగుతున్న ఈ మూవీ షూట్లో గాయపడ్డారట నితిన్. ఏపీలోని మారేడు మిల్లి అడవుల్లో.. నితిన్‌ పై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ పిక్చరైజ్‌ చేస్తున్నారట ఈ మూవీ యూనిట్. ఇక ఈక్రమంలోనే.. ఆ యాక్షన్ సీన్స్‌ చేస్తూ.. నితిన్ ప్రమాదానికి గురయ్యారట. దీంతో నితిన్ చేతికి గాయం అయిందట. దీంతో నితిన్‌ను వెంటనే దగ్గర్లో ఆసుపత్రికి తీసుకెళ్లారట మూవీ టీం. అయితే గాయం తీవ్రత మీడియంగా ఉండడంతో.. ఓ మూడు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంటూ డాక్టర్లు చెప్పారట. దీంతో ఈ మూవీ షూట్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారట డైరెక్టర్ వేణు శ్రీరామ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos