Killer Soup OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ కిల్లర్‌ సూప్‌ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పాయ్ నటించిన కిల్లర్‌ సూప్‌. అభిషేక్‌ చౌబే తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌ లో కొంకణా సేన్‌ శర్మ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, షయాజీ షిండే, లాల్‌, రాజీవ్‌ రవీంద్ర నాథన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు

Killer Soup OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ కిల్లర్‌ సూప్‌ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Killer Soup Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2024 | 7:50 AM

ఇతర జానర్లతో పోల్చుకుంటే ఓటీటీలో క్రైమ్‌, థ్రిల్లర్‌, హార్రర్‌, సస్పెన్స్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే హీరోలు, దర్శక నిర్మాతలు ఈ జానర్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియెన్స్‌ను అలరించేందుకు మరో సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్ సిరీస్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అదే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ ఫేమ్‌ మనోజ్‌ బాజ్‌పాయ్ నటించిన కిల్లర్‌ సూప్‌. అభిషేక్‌ చౌబే తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌ లో కొంకణా సేన్‌ శర్మ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, షయాజీ షిండే, లాల్‌, రాజీవ్‌ రవీంద్ర నాథన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. టీజర్స్‌, ట్రైలర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన కిల్లర్‌ సూప్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం (జనవరి 11) అర్ధరాత్రి నుంచే క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ కిల్లర్ సూప్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

కిల్లర్ సూప్ సిరీస్ లో మనోజ్ బాజ్‌ పాయ్‌ డబుల్‌ రోల్‌ పోషించడం విశేషం. ఆయన ఇలా కనిపించడం ఇదే మొదటిసారి. చేతన్‌ కౌశిక్‌, హనీ త్రెహాన్‌ నిర్మాతలుగా వ్యవహరించగా, రవి తివారీ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉన్నాయి. వీకెండ్‌లో మంచి క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ లు చూడాలనకునే వారికి కిల్లర్‌ సూప్‌ మంచి ఆప్షన్‌.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ ట్రైలర్

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..