Guntur Kaaram: గుంటూరు కారం సినిమా చూస్తానంటోన్న కింగ్ ఖాన్.. ‘మై ఫ్రెండ్ మహేశ్ బాబు’ అంటూ షారుక్ ట్వీట్‌

కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ వర్కవుట్ అవ్వడంతో సగటు సినీ ప్రేక్షకులు కూడా గుంటూరు కారంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాపై బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశాడు. గుంటూరు కారం మూవీ ట్రైలర్‌ను షేర్‌ చేసిన ఆయన

Guntur Kaaram: గుంటూరు కారం సినిమా చూస్తానంటోన్న కింగ్ ఖాన్.. 'మై ఫ్రెండ్ మహేశ్ బాబు' అంటూ షారుక్  ట్వీట్‌
Shahrukh Khan, Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2024 | 7:47 PM

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ‘గుంటూరు కారం’. తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ కు మాస్‌ ఎలిమెంట్స్‌ ని జోడించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు. లేటెస్ట్‌ సెన్సేషన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటించగా, మీనాక్షి చౌదరి మహేశ్‌ మరదలి పాత్రలో మెప్పించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో రిలీజైన గుంటూరు కారం సూపర్‌ హిట్‌ టాక్ తో దూసుకెళుతోంది. కొన్ని చోట్ల నెగెటివ్‌ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.90 కోట్లకు పైగా రాబట్టిన గుంటూరు కారం రెండో రోజు కాస్త తగ్గినా మోస్తరు కలెక్షన్లనే సాధించింది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ వర్కవుట్ అవ్వడంతో సగటు సినీ ప్రేక్షకులు కూడా గుంటూరు కారంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమాపై బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేశాడు. గుంటూరు కారం మూవీ ట్రైలర్‌ను షేర్‌ చేసిన ఆయన ‘గుంటూరు కారం సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను మై ఫ్రెండ్ మహేశ్ బాబు. యాక్షన్, ఎమోషన్… వాటితో పాటే మాస్… ముట్టుకుంటే నిప్పు’ అని ట్వీట్‌ చేశారు.

ఇక షారుఖ్ ఖాన్ పోస్టుపై మహేశ్ బాబు కూడా వెంటనే స్పందించారు. ‘షారుఖ్ ఖాన్… మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు, మీ ఇంట్లో వాళ్లందరికీ నా ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు . మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఛాటింగ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, ఈశ్వరి రావు, ప్రకాశ్‌ రాజ్‌, జయరాం, రఘుబాబు, రావు రమేశ్, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థమన్‌ స్వరాలు సమకూర్చారు

ఇవి కూడా చదవండి

షారుక్ ఖాన్ ట్వీట్..

మహేశ్ బాటు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!