Samantha: సమంత మనసులో ఆ భయం.. ఇష్టమే కానీ పట్టుకోవాలంటే భయమేస్తోందట..
కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు హైదరాబాద్ నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పలు యాడ్స్, రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఓ ఫోటో షేర్ చేస్తూ తన మనసులో ఉన్న భయాన్ని పెట్టింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టూ బాలీవుడ్ వరకు ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. చివరిసారిగా ఖుషి సినిమాలో కనిపించింది సామ్. విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ విజయం అందుకుంది. ఈమూవీ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది సమంత. ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. కొన్నాళ్లు అమెరికా, భూటాన్ దేశాల్లో మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకున్న సామ్.. ఇప్పుడు హైదరాబాద్ నివాసంలోనే విశ్రాంతి తీసుకుంటుంది. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పలు యాడ్స్, రియాల్టీ షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఓ ఫోటో షేర్ చేస్తూ తన మనసులో ఉన్న భయాన్ని పెట్టింది.
తాజాగా తన ఇన్ స్టాలో ఓ బొకే పట్టుకుంటున్న ఫోటోను షేర్ చేసింది సామ్. అలాగే ఆసక్తికర క్యాప్షన్ గురించి రాసుకొచ్చింది. “ఇలాంటి బొకేలు చూసినప్పుడు మిశ్రమ భావనలు కలుగుతాయి. ఎందుకంటే నేను పువ్వులను ఇష్టపడతాను. కానీ నా శరీరానికి వీటి వల్ల ఎలర్జీ వస్తుంది. గతంలో ఈ పువ్వుల కారణంగానే నేను ఎమర్జెన్సీ రూంకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే వాటిని చూస్తేనే భయమేస్తుంది” అంటూ రాసుకొచ్చింది. సామ్ చేసిన పోస్ట్ వైరలవుతుండడంతో ఈ ఫోటోలో సామ్ చాలా క్యూట్ గా ఉన్నారని.. చిరునవ్వు ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఖుషి సినిమాలో కనిపించింది సామ్. అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. బీటౌన్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి రాజ్, డీకే దర్శకత్వం వహించారు. ఇక ఇటీవలే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది సామ్. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2లో సామ్ స్పెషల్ సాంగ్ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.