Hanuman Movie: ‘హనుమాన్’ సెన్సెషన్.. నటీనటుల రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?..

జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు హనుమాన్ సినిమాతో మరోసారి క్రేజ్ సంపాదించుకున్నాడు. పురాణాలు ఇతిహాసాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు

Hanuman Movie: 'హనుమాన్' సెన్సెషన్.. నటీనటుల రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ?..
Hanuman Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2024 | 7:04 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న చిత్రాల్లో హనుమాన్ ఒకటి. సంక్రాంతి బరిలో ఈనెల 12న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జాంబీ రెడ్డి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు హనుమాన్ సినిమాతో మరోసారి క్రేజ్ సంపాదించుకున్నాడు. పురాణాలు ఇతిహాసాల నుంచి కొన్ని అంశాలను తీసుకుని రూపొందించిన ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ లోనూ భారీ వసూళ్లు రాబడుతుంది. మొత్తం రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు రూ.21 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ మూవీ రూ.12.45 కోట్లు రాబట్టింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం నటీనటులు, డైరెక్టర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. ఇందులో హీరోగా నటించిన తేజ సజ్జా.. ఈ చిత్రానికి రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ అమృతా అయ్యార్ రూ. 1.5 కోట్ల పారితోషికం తీసుకుందట. అంజమ్మ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాకు రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వినయ్ రాయ్ ఈ చిత్రానికి రూ.65 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అలాగే పాపులర్ కమెడియన్ వెన్నెల కిషోర్ రూ. 55 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తేజా సజ్జా. తెలుగులో ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి అలరించాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత సమంత నటించి ఓబేబీ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి సినిమాలో నటించాడు తేజ. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?