Varalaxmi Sarathkumar: పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‏కుమార్.. మ్యారేజ్ పై ఆసక్తికర కామెంట్స్.

హనుమాన్ సినిమాలో అంజమ్మ పాత్రలో నటించి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల గురించి పక్కన పెడితే వరలక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి నిత్యం వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా లవ్, మ్యారెజ్ రూమర్స్ తెగ హల్చల్ అవుతుంటాయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Varalaxmi Sarathkumar: పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‏కుమార్.. మ్యారేజ్ పై ఆసక్తికర కామెంట్స్.
Varalaxmi Sarathkumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 14, 2024 | 6:39 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టి .. ఇప్పుడు టాలీవుడ్‏లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో విలన్ పాత్రలో నటించి ఒక్కసారిగా ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇటీవలే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమాలోనూ కీలకపాత్ర పోషించింది. ఈ సినిమాతో మరోసారి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. హనుమాన్ సినిమాలో అంజమ్మ పాత్రలో నటించి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల గురించి పక్కన పెడితే వరలక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి నిత్యం వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా లవ్, మ్యారెజ్ రూమర్స్ తెగ హల్చల్ అవుతుంటాయ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాలుగు పదుల వయసుకు దగ్గరలో ఉన్న ఈ భామ మ్యారెజ్ గురించి కుండబద్దలు కొట్టింది.

తన జీవితంలో పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని.. లైఫ్ లో మ్యారేజ్ అనేది ఒక పార్ట్ మాత్రమే అని. గోల్ కాదని తెలిపింది. వివాహనికి తాను వ్యతిరేకం కాదని.. ఇంట్లో తన పెళ్లి గురించి మాట్లాడటం 18 ఏళ్ల క్రితమే ఆపేశారని .. తన దృష్టిలో పెళ్లి అనేది ముఖ్యం కాదని.. మ్యారేజ్ చేసుకున్నా ఓకే.. చేసుకోకపోయినా ఓకే అని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా చాలా మంది ఉన్నారని… తన స్నేహితురాలు త్రిష సైతం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉందని.. పెళ్లి జీవితంలో ఒక పార్ట్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అలాగే బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తనకు కొన్ని ఆఫర్స్ వచ్చాయని.. కానీ వాటిలో ఉత్సాహం లేదని.. ప్రస్తుతం బాలీవుడ్ తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఉద్దేశం లేదని.. తెలుగులో ఇంకా మంచి పాత్రలు వస్తే చేస్తానని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?