Team India: ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు.. ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో

అఫ్గానిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, తిలక్ వర్మ ఉజ్జయిని చేరుకున్నారు. అనంతరం మహాకాళేశ్వరాలయానికి వచ్చిన నలుగురు క్రీడాకారులు నంది హాలులో భక్తులతో కలిసి కూర్చుని బాబా మహాకాళుని దివ్య భస్మ హారతి పూజలో పాల్గొని ఆశీస్సులు పొందారు.

Team India: ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు.. ప్రత్యేక పూజలు.. వీడియో ఇదిగో
Team India
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 12:44 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన భస్మ హారతి పూజలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు పాల్గొన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా ఆటగాళ్లు రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, తిలక్ వర్మ ఉజ్జయిని చేరుకున్నారు. అనంతరం మహాకాళేశ్వరాలయానికి వచ్చిన నలుగురు క్రీడాకారులు నంది హాలులో భక్తులతో కలిసి కూర్చుని బాబా మహాకాళుని దివ్య భస్మ హారతి పూజలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబా మహాకాళ్ ఆరతి పూజలో పాల్గొన్న అనంతరం టీం ఇండియా వికెట్ కీపర్ జితేష్ శర్మ మాట్లాడుతూ.. ‘నేను బాబా మహాకాల్ భక్తుడిని. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ‘ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా మహాకాళ దేవాలయం, అలాగే ఇక్కడ జరిగే భస్మ హారతి గురించి నేను విన్నాను. అయితే తొలిసారిగా బాబా మహాకాల్‌ను చూసేందుకు వచ్చాను. భస్మ హారతి పూజలో పాల్గొన్నాను’ అని స్పిన్నర్ రవి బిష్ణోయ్ తెలిపాడు.

భారత్-ఆఫ్ఘనిస్థాన్ 3వ మ్యాచ్ ఎప్పుడంటే?

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జనవరి 17న చివరి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమ్ ఇండియా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ మ్యాచ్ తర్వాత టీమ్ ఇండియా టీ20 మ్యాచ్ లు ఇప్పట్లో లేవు. అంటే టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆడబోయే చివరి టీ20 మ్యాచ్ ఇదే. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కూడా షురూ కానుంది.

ఇవి కూడా చదవండి

ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో టీమిండియా క్రికెటర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం