Virat Kohli: రీఎంట్రీతో కింగ్ కోహ్లీ స్పెషల్ రికార్డ్.. తొలి భారత ఆటగాడిగా సరికొత్త చరిత్ర..
Virat Kohli Records: పాల్ స్టిర్లింగ్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్. ఐర్లాండ్ ఓపెనర్ టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో 2074 పరుగులు చేశాడు. దీని ద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో ముఖ్యంగా ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 2012 పరుగులు చేయడం ద్వారా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ అరుదైన రికార్డును నమోదు చేసిన తొలి భారతీయుడు కూడా కింగ్ కోహ్లీనే.

India vs Afghanistan, Virat Kohli Records: ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఇచ్చిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 4 వికెట్లు కోల్పోయి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను గెలుచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్‌లో భారీ రికార్డులు నెలకొల్పారు.
విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్ ద్వారా టీ20 క్రికెట్ లోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లి గొప్ప రికార్డును లిఖించాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన కోహ్లి 16 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ 29 పరుగులతో టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో 2000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గానూ, ప్రపంచంలో 2వ ఆటగాడిగానూ నిలిచాడు.
పాల్ స్టిర్లింగ్ ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్. ఐర్లాండ్ ఓపెనర్ టీ20 క్రికెట్‌లో ఛేజింగ్‌లో 2074 పరుగులు చేశాడు. దీని ద్వారా పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో ముఖ్యంగా ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
ఇప్పుడు విరాట్ కోహ్లీ 2012 పరుగులు చేయడం ద్వారా ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ అరుదైన రికార్డును నమోదు చేసిన తొలి భారతీయుడు కూడా కింగ్ కోహ్లీనే. 14 నెలల తర్వాత మళ్లీ టీ20 మ్యాచ్ ఆడిన విరాట్ కోహ్లి 29 పరుగులతో ప్రత్యేక రికార్డును లిఖించుకుని తన రికార్డుల జాబితాలో మరో రికార్డును చేర్చుకోవడం విశేషం.
View this post on Instagram
భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.
అఫ్ఘనిస్తాన్ జట్టు..
రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




