AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lingoccha OTT: సంక్రాంతి స్పెషల్‌.. ఓటీటీలోకి వచ్చేసిన కార్తీక్‌ రత్నం ‘లింగొచ్చా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గతేడాది కార్తీక్‌ రత్నం నటించిన చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా మెరిసింది. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్, ఉత్తేజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 27న థియేటర్లలో

Lingoccha OTT: సంక్రాంతి స్పెషల్‌.. ఓటీటీలోకి వచ్చేసిన కార్తీక్‌ రత్నం ‘లింగొచ్చా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Lingoccha Movie
Basha Shek
|

Updated on: Jan 15, 2024 | 9:02 AM

Share

కేరాఫ్ కంచరపాలెం, నారప్ప సినిమాలతో టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తీక్ రత్నం. ఓ వైపు హీరోగా నటిస్తూనే నితిన్‌ చెక్‌, రౌడీ బాయ్స్‌ తదితర సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌ పోషిస్తూ మెప్పిస్తున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. వ్యవస్థ లాంటి వెబ్‌ సిరీస్‌లతోనూ మెప్పిస్తున్నాడు. గతేడాది కార్తీక్‌ రత్నం నటించిన చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్‍గా మెరిసింది. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్, ఉత్తేజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 27న థియేటర్లలో రిలీజైన లింగొచ్చా యావరేజ్‌గా నిలిచింది. అప్పటికే బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో మోస్తరు కలెక్షన్లకే మాత్రమే పరిమితమైంది. అయితే హైదరాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కడం, హిందూ- ముస్లిం ప్రేమకథ కావడంతో యూత్‌కు బాగానే ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లింగోచ్చా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా కార్తీక్‌ రత్నం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో సంక్రాంతి పండగ కానుకగా లింగొచ్చా సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఆహా.

లింగొచ్చా సినిమాలో చాలా మంది కొత్త వాళ్లే నటించడం విశేషం. పటాస్ సద్దామ్, కే నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో మెరిశారు. లింగొచ్చా సినిమాకు యాదగిరి రాజు నిర్మాతగా వ్యవహరించగా బికాజ్ రాజ్ సంగీతం అందించారు. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌ పాత బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టోరీ ఇది. శివ (కార్తీక్ రత్నం), ముస్లిం అమ్మాయి నూర్జహాన్ (సుప్యార్ధీ సింగ్) చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. అయితే కొన్ని కారణాలతో నూర్‌ దుబాయికి వెళ్లిపోతుంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ తిరిగి ఇండియాకు వస్తుంది. దీంతో శివ, నూర్జహాన్‌ల ప్రేమ మళ్లీ చిగురిస్తుంది. అయితే ఎప్పటిలాగే నూర్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అడ్డుతగులుతారు. మరి శివ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడో తెలియాలంటే లింగొచ్చా సినిమాను చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి