AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఇది కదా పండగంటే.. మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి సంబరాలు..స్పెషల్‌ అట్రాక్షన్‌గా పవన్‌ కొడుకు, కూతురు

సంక్రాంతి సెలబ్రేషన్స్‌కు సంబంధించి మెగా ఫ్యామిలీ షేర్‌ చేసుకున్న ఫొటోస్‌ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో భాగమయ్యారు. ఇందుకు బెంగళూరులోని ఫామ్‌ హౌస్‌ వేదికగా మారింది

Chiranjeevi: ఇది కదా పండగంటే.. మెగా ఫ్యామిలీ ఇంట సంక్రాంతి సంబరాలు..స్పెషల్‌ అట్రాక్షన్‌గా పవన్‌ కొడుకు, కూతురు
Chiranjeevi Family
Basha Shek
|

Updated on: Jan 16, 2024 | 6:49 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి పండగను సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు కూడా తమ ఫ్యామిలీతో కలిసి పొంగల్‌ పండగను జరుపుకొంటున్నారు. అనంతరం ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. అలా సంక్రాంతి సెలబ్రేషన్స్‌కు సంబంధించి మెగా ఫ్యామిలీ షేర్‌ చేసుకున్న ఫొటోస్‌ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో భాగమయ్యారు. ఇందుకు బెంగళూరులోని ఫామ్‌ హౌస్‌ వేదికగా మారింది. అయితే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లోపవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పాల్గొన లేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నందున అతను ఈ వేడుకలకు హాజరుకాలేకపోయాడు. అయితే అతని పిల్లలు మాత్రం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో అకీరా నందన్‌, ఆద్య అందరి దృష్టినీ ఆకర్షించారు. మెగా స్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికల్లో ఈ ఫొటోస్ ను షేర్ చేశారు ‘పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని విషెస్ తెలిపారుజ

ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీకి ఈసారి సంక్రాంతి చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్- ఉపాసనల కూతురు క్లీంకార కొణిదెల ఇదే తొలి సంక్రాంతి పండగ. అలాగే గతేడాది నవంబరులో పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు కూడా ఇదే మొదటి సంక్రాంతి కావడం విశేషం. సంక్రాంతి సంబరాల కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రెండు రోజుల పాటు బెంగళూరులోనే ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోల్లో మగవాళ్లు అందరూ లైట్‌ బ్రౌన్‌ కలర్‌ కుర్తాలో కనిపించగా.. ఆడవాళ్లందరూ రెడ్ శారీలో దర్శనమిచ్చారు. మొత్తానికి ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులకు రెండు కళ్లు సరిపోవట్లేదు.

ఇవి కూడా చదవండి

మెగా 156 టైటిల్ ఖరారు..

Follow Us
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
వరల్డ్ కప్ గెలిస్తే విన్నర్ కు ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
మరోసారి రెచ్చిపోయిన ర్యాప్ గ్యాంగ్.. తక్కువ ధరకే బంగారం అంటూ..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
జూలై 2026 మాసఫలాలు: ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
వివాదంలో ఐపీఎల్ క్రికెటర్.. పోలీస్ కేసు నమోదు!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..