AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaatera OTT: ‘కాటేరా’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ స్టార్ సినిమా..

ఇప్పటికే ఓటీటీ వేదికల్లో అనేక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో వారం రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. కోలీవుడ్ నటుడు యోగిబాబు నటించిన గుడ్ లక్ గణేశా సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే 'కాటేరా'.

Kaatera OTT: 'కాటేరా' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. తెలుగులో రిలీజ్ కానున్న కన్నడ స్టార్ సినిమా..
Kaatera Movie
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2024 | 10:39 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగు సినిమాలే కాకుండా ఇతర భాషల్లో భారీ విజయాలను అందుకున్న చిత్రాలను సైతం తెలుగులోకి డబ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఓటీటీ వేదికల్లో అనేక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో వారం రోజుల్లో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయి. కోలీవుడ్ నటుడు యోగిబాబు నటించిన గుడ్ లక్ గణేశా సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. అదే ‘కాటేరా’. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన లేటేస్ట్ సినిమా ఇదే. గతేడాది డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా దీనిని పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అటు సలార్ బరిలో ఉండడంతో కేవలం కన్నడలో మాత్రమే విడుదల చేశారు. ఈ సినిమా విడుదలై 18 రోజులు గడుస్తున్నా.. చాలా చోట్ల సినిమా హౌస్ ఫుల్ అవుతున్నాయి.. ఈ సినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది.

ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే థియేటర్లలో మాత్రం కాదు.. కేవలం ఓటీటీలోనే ఈ సినిమా తెలుగులోకి అందుబాటులోకి రానుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం జీ5లో తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు ఈ సినిమా ఓటీటీలో కంటే ముందు థియేటర్లలోకి రానున్నట్లు తెలుస్తోంది. జనవరి 26న ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ మూవీ తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 1970 బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.105 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో సీనియర్ హీరోయిన్ మాలా శ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఇందులో జగపతి బాబు ప్రతినాయకుడిగా కనిపించారు.

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..