AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swayambhu: ‘హనుమాన్‌’ భక్తుడిగా హీరో నిఖిల్‌.. స్వయంభూ సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే?

నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సెన్సేషన్‌ సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు నిఖిల్‌. ఒక హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శత్రువులను చీల్చి చెండాడే యుద్ద వీరుడిగా కనిపించనున్నాడీ యంగ్ హీరో

Swayambhu: 'హనుమాన్‌' భక్తుడిగా హీరో నిఖిల్‌.. స్వయంభూ సినిమా రిలీజ్‌ ఎప్పుడంటే?
Swayambhu Movie
Basha Shek
|

Updated on: Jan 17, 2024 | 1:11 PM

Share

కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్‌. అయితే ఆ తర్వాత అతను చేసిన 18 పేజీస్‌, స్పై సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ పాన్‌ ఇండియా మూవీతోనే హిట్‌ కొడతానంటున్నాడీ యంగ్‌ హీరో. నిఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం స్వయంభు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళం సెన్సేషన్‌ సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం తన మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నాడు నిఖిల్‌. ఒక హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో శత్రువులను చీల్చి చెండాడే యుద్ద వీరుడిగా కనిపించనున్నాడీ యంగ్ హీరో. ఇందుకోసం కత్తి తిప్పడంలో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోన్న నిఖిల్‌ తన సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. తాజాగా తన సినిమా స్వయంభూ గురించి మరో కీలక అప్డేట్‌ ఇచ్చాడీ ట్యాలెంటెడ్‌ హీరో.

‘మా స్వయంభూ సినిమా షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్‌ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా ఫేవరెట్‌ డైలాగ్‌ జై శ్రీరామ్‌. ప్రస్తుతం అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం. దసరా లేదా దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం’ అంంటూ షూట్‌లో గుర్రంపై వస్తోన్న జిఫ్‌ను షేర్‌ చేశాడు నిఖిల్‌. థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం సృష్టిస్తోన్న ఈ సమయంలో నిఖిల్‌ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

సోషియో ఫాంటసీ జానర్‌లో రూపుదిద్దుకుంటోన్న స్వయంభూ సినిమాను భువన్, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ నిర్మాణంలో ది ఇండియన్‌ హౌజ్‌ అంటూ ఓ భారీ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్‌. అలాగే కార్తికేయ సిరీస్‌లో మూడో భాగం కూడా రానుందని ఇది వరకే రివీల్‌ చేశాడు.

దీపావళికి వస్తున్నాం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత