ఉసిరిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మిశ్రమాలుంటాయి. మహిళల్లో ఎదురయ్యే నెలసరి సమస్యలు తగ్గించడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో ఉసిరి సాయపడుతుంది. రోజూ ఒక ఉసిరి కాయ తింటే కఫం సమస్యలు తగ్గుతాయని, పరగడుపున ఒక స్పూను ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు అంటున్నారు.