ప్రస్తుత రోజుల్లో శారీరక వ్యాయామం అనేది మంచి ఆరోగ్యానికి ప్రతీకగా మారింది. మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆహార అలవాట్లు మారడంతో కచ్చితంగా ఊబకాయం అనేది అందరినీ వేధిస్తుంది. అలాగే ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, కీళ్ల నొప్పులు వంటివి వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యల నుంచి రక్షణకు కచ్చితంగా నడకే దివ్య ఔషధం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు పది వేల అడుగులు వేస్తే బోలెడన్ని లాభాలు ఉంటాయిన పేర్కొంటున్నారు. కాబట్టి నడక వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.