- Telugu News Photo Gallery Body Oil for Dry Skin: 5 Natural Body Oils That Can Nourish Your Dry Skin In This Cold Weather
Body Oils for Dry Skin: శరీరానికి సహజ మాయిశ్చరైజర్లుగా పనిచేసే నూనెలు ఇవే.. బెస్ట్ బాడీ ఆయిల్స్!
శీతాకాలంలో చర్మానికి ఇంటెన్సివ్ కేర్ అవసరం. వాతావరణం పొడిబారడం వల్ల చర్మం పొడిబారుతుంది. మాయిశ్చరైజర్ చేయకుండే చర్మం గరుకుబారుతుంది. అందుకే చలికాలంలో హెవీ మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది. బాడీ లోషన్‌ను చర్మంపై అప్లై చేసిన తర్వాత ఒక్కసారి చేతులు, కాళ్లు కడుక్కుంటే బాడీలోషన్ పోతుంది. అయితే బాడీ లోషన్‌కు బదులు, నూనెలు శరీరానికి అప్లై చేశారంటే శరీరం ఎల్లప్పుడూ మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ల కంటే బాడీ ఆయిల్ చర్మానికి అదనపు తేమను అందిస్తుంది. అంతేకాకుండా ఈ నూనెలు..
Updated on: Jan 21, 2024 | 9:53 PM

శీతాకాలంలో చర్మానికి ఇంటెన్సివ్ కేర్ అవసరం. వాతావరణం పొడిబారడం వల్ల చర్మం పొడిబారుతుంది. మాయిశ్చరైజర్ చేయకుండే చర్మం గరుకుబారుతుంది. అందుకే చలికాలంలో హెవీ మాయిశ్చరైజర్ అవసరం అవుతుంది. బాడీ లోషన్‌ను చర్మంపై అప్లై చేసిన తర్వాత ఒక్కసారి చేతులు, కాళ్లు కడుక్కుంటే బాడీలోషన్ పోతుంది.

అయితే బాడీ లోషన్‌కు బదులు, నూనెలు శరీరానికి అప్లై చేశారంటే శరీరం ఎల్లప్పుడూ మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ల కంటే బాడీ ఆయిల్ చర్మానికి అదనపు తేమను అందిస్తుంది. అంతేకాకుండా ఈ నూనెలు సహజ పదార్ధాలతో తయారు చేయబడతాయి. ఇవి చర్మానికి పోషణ అందిస్తాయి. ఏ ఆయిల్ వాడితే చర్మానికి మేలు చేస్తుందో ఇక్కడ చూద్దాం..

జోజోబా ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ నూనెలో విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ ఉంటాయి. జోజోబా నూనెను జిడ్డుగల చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. ఇది చర్మం అదనపు నూనెల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. జొజోబా నూనెను సున్నితమైన చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. అర్గాన్ ఆయిల్‌ని 'లిక్విడ్ గోల్డ్' అని అంటారు. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఆర్గాన్ ఆయిల్ చర్మానికి తేమను అందించడంతో పాటు యాంటీ ఏజింగ్ ఇంగ్రిడియంట్‌గా పనిచేస్తుంది.

బాదం నూనె చర్మ సంరక్షణలో బాగా పనిచేస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఎ, ఇ, డి ఉంటాయి. బాదం నూనె పొడి చర్మానికి తేమను అందించడంతో పాటు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనె అనేక చర్మ సమస్యలను నయం చేస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఆలివ్ నూనెను వంటకే కాకుండా చర్మానికి కూడా అప్లై చేయవచ్చు. ఆలివ్ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉంటాయి. ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిస్తుంది.




