AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Records: ఇదో వింత రికార్డు.. 3 సెకన్లలో కప్పు కాఫీ తాగిన వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు..

కాఫీని తాగడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని పలు రకాల అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అదే విధంగా అతిగా తాగితే.. కాఫీ వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని కూడా మనందరికీ తెలుసు. అలాంటి కాఫీని అందరూ దాని రుచిని ఆస్వాదిస్తూ తాగుతుంటారు. కొందరు ఫస్ట్‌గా తాగేస్తుంటారు.. అయితే ఎంత ఇష్టపడినా సెకన్ల వ్యవధిలో మెరుపు వేగంతో తాగలేరు. ఇక్కడ చూపించబోయే వీడియో చూస్తే మీరు షాక్‌ అవుతారు.. ఇక్కడో వ్యక్తి మెరుపు వేగంతో ఒక కప్పు కాఫీ తాగి రికార్డ్ సృష్టించాడు.

Guinness World Records:  ఇదో వింత రికార్డు..  3 సెకన్లలో కప్పు కాఫీ తాగిన వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు..
Guinness World Records: Fastest Time To Drink A Cup Of Coffee
Jyothi Gadda
|

Updated on: Jan 18, 2024 | 9:42 AM

Share

ప్రపంచంలో చాలామంది కాఫీని ఇష్టపడతారు. కమ్మటి కాఫీ వాసన చూడగానే శరీరం మొత్తం యాక్టివ్‌ అయిపోతుంది. కొంతమందికి ఉదయం నిద్రలేవగానే కప్పు కాఫీ కడుపులో పడాల్సిందే..లేదంటే బెడ్‌ కూడా దిగరు.. మరికొందరు ఐదారు కప్పుల కాఫీ హాంఫట్‌ చేసేస్తారు. అయితే, కాఫీని తాగడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని పలు రకాల అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అదే విధంగా అతిగా తాగితే.. కాఫీ వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందని కూడా మనందరికీ తెలుసు. అలాంటి కాఫీని అందరూ దాని రుచిని ఆస్వాదిస్తూ తాగుతుంటారు. కొందరు ఫస్ట్‌గా తాగేస్తుంటారు.. అయితే ఎంత ఇష్టపడినా సెకన్ల వ్యవధిలో మెరుపు వేగంతో తాగలేరు. ఇక్కడ చూపించబోయే వీడియో చూస్తే మీరు షాక్‌ అవుతారు.. ఇక్కడో వ్యక్తి మెరుపు వేగంతో ఒక కప్పు కాఫీ తాగి రికార్డ్ సృష్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

ప్రపంచంలోని ఎన్నో రికార్డులను మీరు చూసి ఉంటారు. కానీ ఓ కుర్రాడు చేసిన రికార్డు మాత్రం అద్భుతం. జనం సులువుగా ఎంజాయ్ చేసే కాఫీని రెప్పపాటులో తాగేశాడు ఆ కుర్రాడు. అతను ఇలా చేయడం చూస్తే మీకు కూడా వింతగా అనిపించవచ్చు. కాని ఆ అబ్బాయి ఒక్కసారిగా ఎంతో నమ్మకంతో మగ్ నిండా కాఫీ తాగేశాడు. అతను కేవలం 3 సెకన్లలో ఈ కప్పు కాఫీ తాగడం పూర్తి చేశాడు. ఇతని పేరు ఫెలిక్స్ వాన్ మెయిబోమ్. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నివాసి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఫెలిక్స్ మెరుపు వేగంతో ఒక కప్పు కాఫీ తాగి రికార్డ్ సృష్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయబడింది. వీడియోలో, బ్లాక్ కాఫీని కాఫీ మగ్‌లో పోస్తారు. టేబుల్‌పై ఉన్న మొబైల్ ఫోన్‌లో టైమ్‌ సెట్ చేశారు.. అతడు ఖచ్చితంగా 3 సెకన్లలో ఒకే బుక్కలో కాఫీ మొత్తం తాగేశాడు..

ఈ ఆసక్తికరమైన రికార్డ్‌ చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఒక వ్యక్తి సరదాగా నేను ప్రతి రోజూ ఉదయం ఇలాగే చేస్తానని చెబుతున్నాడు. మరొక వినియోగదారు ఇది నేను కూడా చేయగలను అంటూ చెప్పారు. మరో వినియోగదారు గొప్ప విశ్వాసంతో నేను అతనిని ఓడించగలను అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..