Rajahmundry Central Jail: బెయిల్‌పై విడుదలైన ఖైదీ.. అదే జైలు బయట బైఠాయించి నిరసన! కారణం ఇదే!

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఖైదీ.. జైలు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. దొంగతనం కేసులో అరెస్టు అయిన సదరు వ్యక్తి.. ఈ నెల 3వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. రిమాండ్‌లో వేసినప్పుడు తనవద్ద ఉన్న ఎనిమిది వందల అరవై రూపాయలు ఇవ్వకుండా జైలు సిబ్బంది తిప్పించుకుంటున్నారని ప్లకార్డ్ తో నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని కొట్టుకుంటూ జైలు లోపలికి బలవంతంగా..

Rajahmundry Central Jail: బెయిల్‌పై విడుదలైన ఖైదీ.. అదే జైలు బయట బైఠాయించి నిరసన! కారణం ఇదే!
Jail
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 19, 2024 | 9:22 PM

రాజమండ్రి, జనవరి 19: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఖైదీ.. జైలు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు. దొంగతనం కేసులో అరెస్టు అయిన సదరు వ్యక్తి.. ఈ నెల 3వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. రిమాండ్‌లో వేసినప్పుడు తనవద్ద ఉన్న ఎనిమిది వందల అరవై రూపాయలు ఇవ్వకుండా జైలు సిబ్బంది తిప్పించుకుంటున్నారని ప్లకార్డ్ తో నిరసన తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని కొట్టుకుంటూ జైలు లోపలికి బలవంతంగా తీసుకుపోయారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..

విజయనగరం జిల్లా ఎస్ కోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలుకు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం రిమాండ్ మీద జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతని వద్ద రూ.860 ఉన్నాయని, వాటిని పోలీసులు తీసుకున్నారట. బెయిల్‌పై విడుదలైన తర్వాత అతనికి రావల్సిన డబ్బు పోలీసులు చెల్లించలేదని రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట బైఠాయించి నిరసన తెలపసాగాడు. తనకు రావలసిన 860 ఎందుకు ఇవ్వడం లేదంటూ ఓ పవిత్రమైన న్యాయమా.. దైవ సమానమైన న్యాయమా.. ఈ పేదవాడికి న్యాయం చేయండి అంటూ జైలు బయట నిరసన తెల్పుతున్నాడు. దీంతో విసిగెత్తిపోయిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీనివాస్‌ను బలవంతంగా కొట్టుకుంటూ జైలు లోపలికి తీసుకు వెళ్లారు. బెయిల్ పై బయటకు వచ్చిన వ్యక్తిని జైలు పోలీసులు కొట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లడంపై స్థానికంగా చర్చకు దారి తీసింది. కేసు నమోదు చేయకుండా జైలు అధికారులు జైల్ లోపలికి తీసుకువెళ్లడానికి వీళ్లేదంటూ అడ్వకేట్లు అంటున్నారు. పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో నష్టం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న శుభం మహేశ్వరి శీతల గిడ్డంగిలో శుక్రవారం (జనవరి 18) సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నించారు. రాత్రి 7 గంటల సమయంలో మంటలు మరింత పెరిగాయి. దీంతో విజయవాడ నుంచి మరో వాహనాన్ని తెప్పించినట్లు ప్రాంతీయ అగ్ని మాపక అధికారి షేక్‌ జిలాని మీడియాకు తెలిపారు. కాగా అగ్ని ప్రమాదానికి గురైన గిడ్డంగిలో కొన్ని వేల బస్తాల పసుపు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం వల్ల కోట్ల రూపాయల్లో నష్టం సంభవించినట్లు గిడ్డంగి యజమాని శ్యామ్‌ మహేశ్వర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.