Andhra Pradesh: మహత్తర ఘట్టానికి వేదికైన విజయవాడ.. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం

మూడేళ్ల నుంచి ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఈ విగ్రహ నిర్మాణానికి 404 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం అందుకు విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానం...

Andhra Pradesh: మహత్తర ఘట్టానికి వేదికైన విజయవాడ.. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం
Ambedkar Statue
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 19, 2024 | 9:29 PM

మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు . దేశంలోనే అతిపెద్ద ఈ విగ్రహాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారు. . స్వరాజ్ మైదానంలోని 18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన కలర్‌ ఫుల్‌ లేజర్‌ షో ప్రజలను కట్టి పడేస్తోంది.

మూడేళ్ల నుంచి ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఈ విగ్రహ నిర్మాణానికి 404 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం అందుకు విజయవాడ నడిబొడ్డులో ఉన్న స్వరాజ్ మైదానం అయితే బెటర్ అని భావించి చర్యలు చేపట్టింది. ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు.

ఈ విగ్రహం మొత్తం 206 అడుగులు ఎత్తులో ఉంటుంది. ఇందులో బేస్‌ను 81 అడుగుల ఎత్తులో నిర్మించారు. విగ్రహాన్ని 125 అడుగుల్లో రూపొందించారు. అంబేద్కర్ స్మృతి వనంలో పచ్చని చెట్లతో పాటు రాత్రి వేళ విద్యుత్తు దీపాల కాంతులతో జిగేల్ మనిపించేలా లైట్లను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవిత గాధతో పాటు స్పూర్తినిచ్చే రచనలు, వివిధ పుస్తకాలతో కూడిన లైబ్రరీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

ఇదిలా అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా విజయవాడలో శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. స్వరాజ్‌ మైదానం వద్దకు కేవలం కేవలం వీఐపీ వాహనాలనే అనుమతించారు. మిగిలిన వాహనాలను దారి మళ్లించారు. రాత్రి 12 గంటల వరకూ విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..