BJP: తెలుగు రాష్ట్రాల్లో ఆరోజు సెలవు ఇవ్వాల్సిందే.. ఇవ్వకపోతే సమరమే అంటున్న కమలదళం..
సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ సర్కార్‌లను నిలదీస్తోంది కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలీ డే ఇచ్చాయి. ఆ హోలీ డే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి.

విజయవాడ, జనవరి 20: సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ సర్కార్‌లను నిలదీస్తోంది కాషాయ పార్టీ. దేశంలో చాలా రాష్ట్రాలు ఎల్లుండి హాలీ డే ఇచ్చాయి. ఆ హోలీ డే గురించి మీకు పట్టదా, రాముడంటే లెక్కలేదా అంటోంది కమలం పార్టీ. 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించకపోతే సమరమే అంటోంది. రాజకీయ పార్టీలన్నాక పోరాటం చేస్తాయి. అయితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పోరాటం చేస్తోంది బీజేపీ. సమస్యల గురించి కాకుండా సెలవుల కోసం యుద్ధం ప్రకటించింది. అయితే అది స్టూడెంట్స్ కోసం కాదు. రామ భక్తుల కోసం.. ఏపీ, తెలంగాణ సర్కార్‌లపై సమరానికి సై అంటూ సీరియస్ అవుతోంది.
ఈ నెల 22న అయోధ్యలోని దివ్య భవ్య నవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టతో కొలువుదీరనున్నాడు బాల రామయ్య. దీంతో 22వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని తెలుగు రాష్ట్రాల్లోని వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ డిమాండ్ చేస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో సెలవు దినం. ఈ నెల 22న అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజును సెలవు దినంగా ప్రకటించారు. అయితే ఆ హోలీ డే నాడు తెలుగు రాష్ట్రాలు హాలీ డే ప్రకటించవా అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 22వ తేదిని సెలవు దినంగా ప్రకటించాలని ఆయా ప్రభుత్వాలను కోరుతోంది కాషాయ పార్టీ.
సమయం లేదు మిత్రమా సెలవు ఇస్తారా, సమరం ప్రకటించమంటారా అంటూ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తోంది రాష్ట్ర బీజేపీ శాఖ. భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటం.. రామమందిర నిర్మాణం రూపంలో సాకారమవుతోందని, బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అయితే ఏపీ ప్రభుత్వం ఈ నెల 21 వరకే సెలవులు ఇచ్చిందంటూ ఆమె విమర్శించారు. 22న బాలరాముని ప్రతిష్టా కార్యక్రమం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అయితే ఆనాడు సెలవు ఇవ్వకపోవడం వెనుక ఏపీ ప్రభుత్వ దురుద్దేశం ఉందని పురంధేశ్వరి ఆరోపించారు.
రామయ్య విగ్రహ ప్రతిష్ట నాడు.. ఏపీ సర్కార్ సెలవు దినం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్ సమస్యను భుజానికెత్తుకుంది స్థానిక బీజేపీ శాఖ. అయోధ్య రాముడు అందరివాడని, రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలు పాలు పంచుకునేందుకు ఈనెల 22న అధికారికంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ సర్కార్‌కు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతల అల్టిమేటమ్, విజ్ఞప్తులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




