CM Revanth Davos Tour: రూ.40,232 కోట్ల పెట్టబడులు.. 200 సంస్థలతో సంప్రదింపులు.. సీఎం దావోస్ టూర్ సాగిందిలా..!

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బృందం.. రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

CM Revanth Davos Tour: రూ.40,232 కోట్ల పెట్టబడులు.. 200 సంస్థలతో సంప్రదింపులు.. సీఎం దావోస్ టూర్ సాగిందిలా..!
Cm Revanth Reddy Davos Tour
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 19, 2024 | 11:00 PM

తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణకు భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌ వెళ్లిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బృందం.. రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. మూడు రోజుల పర్యటనలో వివిధ కంపెనీలకు చెందిన 200 మంది ప్రతినిధులతో సమావేశమయ్యారు. గత ఏడాదిలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఈసారి రెండింతలు పెరిగాయి.

ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. తెలంగాణలో రూ. 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్‌ ముందుకు వచ్చింది. నాలుగు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అదానీ గ్రూప్‌ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ, ఇంధన రంగంలో ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని అదానీ హామీ ఇచ్చారు. అదానీ గ్రూప్ తోపాటు, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

JSW ఎనర్జీ తెలంగాణలో ఏకంగా రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం రేవంత్‌తో JSW గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ సమావేశమైన అనంతరం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఇక గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్‌ అండ్‌ డీతోపాటు గిగా సేల్‌ బ్యాటరీ సెల్‌ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇక రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూపు ముందుకొచ్చింది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్‌ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మరికొన్ని సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్ లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు.

మరో సదస్సులో మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ ను సాఫ్ట్ వేర్ తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని అన్నారు. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని సీఎం అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు.

దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి…‘ అని స్వాగతం పలికారు.

ఇక మూడు రోజుల దావోస్‌ పర్యటన ముగించుకుని లండన్‌ చేరుకున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. లండన్‌లోని ప్రఖ్యాత థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీ అధికారులతో సమావేశమయ్యారు. మూసీ నది ప్రక్షాళన ఒప్పందంపై చర్చించారు. థేమ్స్ నది నిర్వహణపై అధ్యయనం చేసి మూసీ నది ప్రక్షాళనలో అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం. మూసీ నది ప్రక్షాళనపై పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డికి తెలిపారు అధికారులు. మరోవైపు లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిపై ఏరియల్ స్టడీ కోసం లండన్ షార్డ్ వ్యూను సందర్శించారు సీఎం రేవంత్ రెడ్డి, ఎంఐఎం నేత అక్బరుద్దీన్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు