AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard : పర్యాటకుల హోటల్‌ గదిలో దూరిన చిరుత.. రెండు గంటలపాటు అక్కడే మకాం..వైరలవుతున్న వీడియో

ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ బృందం, జూ బృందం అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం చిరుతను జైపూర్ జూకి తరలించారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు అడవుల్లో వదిలిపెట్టారు. కాగా, చిరుత గదిలో ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న సిబ్బంది తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Leopard : పర్యాటకుల హోటల్‌ గదిలో దూరిన చిరుత.. రెండు గంటలపాటు అక్కడే మకాం..వైరలవుతున్న వీడియో
Leopard Entered In Hotel
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2024 | 11:00 AM

Share

మీరు ఉంటున్న హోటల్‌ గదిలోకి చిరుత ప్రవేశిస్తే ఎలా ఉంటుంది..బాబోయ్‌ ఇంకేమైనా ఉందా..? పై ప్రాణాలు పైకే…కానీ, జైపూర్‌లోని కనోటాలో ఉన్న ఓ హోటల్‌లోకి అకస్మత్తుగా చిరుతపులి ప్రవేశించింది. ఈ ఘటనతో హోటల్‌లో బస చేసిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. హోటల్‌లో ఉన్న వారంతా హోటల్‌ను వదిలి పారిపోయారు. హోటల్‌ గదిలోకి దూరిన చిరుత దాదాపు రెండు గంటల పాటు ఆ గదిలోనే గడిపింది. దీంతో హోటల్ యాజమాన్యం వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించింది. అనంతరం అటవీశాఖ బృందం హోటల్‌కు చేరుకుంది. చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందికి చుక్కలు చూపించింది చిరుత.

గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గదిలోకి చిరుత ప్రవేశించింది. హోటల్‌లో ఉన్న కుక్కలు ఒక్కసారిగా బిగ్గరగా అరవటం మొదలుపెట్టాయి. దాంతో హోటల్ నిర్వాహకులు వాటి నోరు మూయించే ప్రయత్నం చేశారు. కానీ కుక్కలు మొరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఓ పర్యాటకుడు హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. అతనికి చిరుతపులి కనిపించిందని చెప్పాడు.. అంతలోనే హోటల్ సిబ్బంది గదిలోకి చిరుత ప్రవేశించింది. చిరుతపులి సమాచారంతో హోటల్‌లో ఉన్న పర్యాటకులు బయటకు పరుగులు తీశారు. చిరుత సిబ్బంది గదిలోకి దూరిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చిరుతను చూసిన హోటల్‌ యాజమాన్యం ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ బృందం, జూ బృందం అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. అనంతరం చిరుతను జైపూర్ జూకి తరలించారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు అడవుల్లో వదిలిపెట్టారు. కాగా, చిరుత గదిలో ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న సిబ్బంది తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్