Puja Tips: కోరిన కోర్కెలు తీర్చడానికి ఏ దేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా..!

హిందూ మతంలో విఘ్నాలకధిపతి వినాయకుడిని మొదట పూజిస్తారు. ఏ పూజైనా, శుభ కార్యమైనా గణేశ పూజతో ప్రారంభిస్తారు. హిందూమత విశ్వాసాల ప్రకారం మందారం, బంతి పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. అంతేకాదు గణేశుడికి కూడా దుర్వా (గడ్డి) అంటే చాలా ఇష్టం. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి మందార, బంతి పువ్వులతో పాటు దర్భ గడ్డిని పూజలో సమర్పించండి. అయితే గణపతికి తులసి ఆకులను పూజలో ఉపయోగించరు. నైవేద్యంలో సమర్పించరు.   

Puja Tips: కోరిన కోర్కెలు తీర్చడానికి ఏ దేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా..!
Hindi Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2024 | 5:35 PM

హిందూమతంలో పువ్వులకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. పూజ, శుభకార్యం, మతపరమైన ఆచారాలు లేదా కొన్ని రకాల కార్యక్రమాల్లో పువ్వులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం వివిధ దేవుళ్ళు, దేవతలు వేర్వేరు పువ్వులను ఇష్టపడతారు. పూజ సమయంలో దేవీ దేవతలకు నచ్చిన పుష్పాలను సమర్పిస్తే.. వారు త్వరగా సంతోషిస్తారు..  కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ నేపథ్యంలో ఏయే దేవతలకు ఏఏ పువ్వులు ఇష్టమో ఈ రోజు తెలుసుకుందాం..

గణేశుడు: హిందూ మతంలో విఘ్నాలకధిపతి వినాయకుడిని మొదట పూజిస్తారు. ఏ పూజైనా, శుభ కార్యమైనా గణేశ పూజతో ప్రారంభిస్తారు. హిందూమత విశ్వాసాల ప్రకారం మందారం, బంతి పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి. అంతేకాదు గణేశుడికి కూడా దుర్వా (గడ్డి) అంటే చాలా ఇష్టం. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి మందార, బంతి పువ్వులతో పాటు దర్భ గడ్డిని పూజలో సమర్పించండి. అయితే గణపతికి తులసి ఆకులను పూజలో ఉపయోగించరు. నైవేద్యంలో సమర్పించరు.

శివుడు: సృష్టి లయకారుడైన శివుని ప్రసన్నం చేసుకోవడానికి.. ఉమ్మెత్త పుష్పాలు, తెల్లని నాగకేసర పుష్పాలు, పారిజాత పువ్వులు, తామరపువ్వు లతో పాటు బిల్వ పత్రాలను సమర్పించండి. అయితే శివుని పూజలో తులసి, మొగలి పువ్వులను ఉపయోగించవద్దు.

ఇవి కూడా చదవండి

విష్ణువు: పురాణాల కథల ప్రకారం తులసి.. విష్ణువుకు చాలా ప్రియమైనది. కనుక విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగిస్తారు. శ్రీ మహా విష్ణువుకి తామర పువ్వులు, మల్లె పువ్వులు, కదంబ పువ్వులు, వైజయంతి పుష్పాలు అంటే చాలా ఇష్టం. కనుక విష్ణు మూర్తి అనుగ్రహం కోసం ఈ పువ్వులను ఉపయోగించండి

లక్ష్మీదేవి: లక్ష్మి దేవిని సంపద, ఐశ్వర్యానికి దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం. ముఖ్యంగా లక్ష్మిదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో తామరపూలను సమర్పించండి. తామర పువ్వులు అందుబాటులో లేకపోతే, లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు కూడా సమర్పించవచ్చు.

హనుమంతుడు: సంకట మోచన హనుమంతుడు కలియుగంలో భూమిపై నడిచే దైవంగా కొలువ బడుతున్నాడు. హనుమంతుడు ప్రసన్నుడైతే భక్తుల అన్ని రకాల కష్టాలను, భయాలను  తొలగిస్తాడని విశ్వాసం. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని బంతిపూలు, ఎర్ర మందార వంటి ఎరుపు రంగు పుష్పాలను హనుమంతుడికి సమర్పించండి.

దుర్గాదేవి: దుర్గాదేవిని అమ్మలకన్నఅమ్మ గా భావించి ఆరాధిస్తారు. దుర్గాదేవి ప్రసన్నురాలైతే భక్తులకు కలిగే అన్ని రకాల బాధలను, రోగాలను దూరం చేస్తుందని నమ్ముతారు. దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి, గులాబీలు, మందార వంటి ఎర్రటి పువ్వులు సమర్పించండి.

గౌరీ దేవి: శివునికి ఇష్టమైన పువ్వులే అంటే ఉమ్మెత్త పుష్పాలు, తెల్లని నాగకేసర పుష్పాలు, పారిజాత పువ్వులు, తామరపువ్వు గౌరీ దేవికి కూడా ప్రీతికరమైనవి. అంతే కాకుండా తెల్ల కమలం, సంపంగి పుష్పాలు కూడా గౌరీ దేవికి ఎంతో ప్రీతికరమైనవి.

శ్రీ కృష్ణుడు: శ్రీ కృష్ణుడికి కుముదం, కలవారి, మాలతి, పలాశ, వనమాల పువ్వులంటే చాలా ఇష్టం. బాల గోపాలుడికి తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

సూర్యనారాయణుడు: ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు గౌరవం, విజయాన్ని అందిస్తాడు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ఉదయాన్నే అర్ఘ్యం సమర్పించి పూజించాలి. సూర్య భగవానుడికి మందార, ఎర్ర కమలం, ఎర్ర బంతి పువ్వులను సమర్పించండి.

సరస్వతి దేవి: చదువుల తల్లి సరస్వతికి తెలుపు, పసుపు రంగులు అంటే చాలా ఇష్టం. సరస్వతి దేవి  ఆశీర్వాదం పొందడానికి, తెలుపు లేదా పసుపు పువ్వులను సమర్పించండి. తెల్ల గులాబీని తల్లి సరస్వతికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు