AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అయోధ్య ఆలయం ప్రాంగణంలో రామయ్య ప్రదక్షిణ.. రామ్ లల్లా విగ్రహ ఫస్ట్ లుక్ రివీల్..

గర్భగుడిలో ప్రతిష్టించబడే రాముడి అసలు విగ్రహాన్ని జనవరి 18న రామాలయ సముదాయానికి తీసుకురావచ్చు. గర్భాలయంలో ప్రతిష్టించే బాల రామయ్య విగ్రహం కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా పూజలు, క్రతువులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.. వాస్తవానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగాల్సి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవ పూజా విధానం ప్రకారం ఈరోజు అంటే జనవరి 17న  బాల రామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు.

Ayodhya: అయోధ్య ఆలయం ప్రాంగణంలో రామయ్య ప్రదక్షిణ.. రామ్ లల్లా విగ్రహ ఫస్ట్ లుక్ రివీల్..
Ram Mandir 2
Surya Kala
|

Updated on: Jan 17, 2024 | 7:15 PM

Share

అయోధ్య నగరంలోనే కాదు దేశ విదేశాల్లో రామమందిరంలో ప్రాణప్రతిష్టకు సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఆలయంలో ప్రతిష్ఠించనున్న రాంలాలా విగ్రహం తొలి చిత్రం బయటకు వచ్చింది. పల్లకీలో కూర్చున్న రామ్ లల్లా ఆలయ ప్రాంగణంలో పర్యటించారు. అయితే గర్భగుడిలో ప్రతిష్టించబోయే అసలు విగ్రహం ఇది కాదు.. ఈ విగ్రహం గర్భ గుడిలో ప్రతిష్ఠించబడదు. ఈ రోజు ఆలయ ప్రాంగణంలో పర్యటనకు తీసుకెళ్లిన విగ్రహం ప్రతీకాత్మక విగ్రహం అని చెబుతారు.

సమాచారం ప్రకారం గర్భగుడిలో ప్రతిష్టించబడే రాముడి అసలు విగ్రహాన్ని జనవరి 18న రామాలయ సముదాయానికి తీసుకురావచ్చు. గర్భాలయంలో ప్రతిష్టించే బాల రామయ్య విగ్రహం కర్నాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా పూజలు, క్రతువులు ప్రారంభమైన సంగతి తెలిసిందే..

వాస్తవానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగాల్సి ఉంది. రామ మందిర ప్రారంభోత్సవ పూజా విధానం ప్రకారం ఈరోజు అంటే జనవరి 17న  బాల రామయ్య విగ్రహాన్ని ఆలయ ప్రాంగణానికి తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం రామ్ లల్లా ఆలయంలోకి ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి
Ram Mandir 1

Ram Mandir 1

నగర పర్యటన కార్యక్రమం రద్దు

ఇంతకు ముందు శ్రీ రాముని బాల రాముడిని అయోధ్య నగర పర్యటనకు తీసుకుని వెళ్లనున్నారని చెప్పారు.  అయితే భద్రతను దృష్టిలో ఉంచుకుని.. నగర పర్యటన కార్యక్రమం రద్దు చేయబడింది. ఆలయప్రాంగణంలో మాత్రమే స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో పర్యటన అనంతరం రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయానికి తీసుకెళ్లారు.

సరయూ జలంతో పవిత్రం

గర్భగుడి పవిత్రీకరణ కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. సరయూ నుంచి తీసుకొచ్చిన నీటితో గర్భగుడిని శుద్ధి చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు దేశ విదేశాలోని నదుల నుంచి తీసుకుని వచ్చిన పవిత్ర నీటితో శుద్ధి చేసే కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్టలో ప్రధాన అతిథిగా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ప్రధాని మోడీ స్వయంగా ప్రధమ పూజ చేస్తారు.

Ram Mandir 3

Ram Mandir 3

ఈ కార్యక్రమంలో పాల్గొననున్న సెలబ్రెటీలు

ఈ వేడుకకు భారతదేశం, విదేశాల నుండి చాలా మంది అతిథులకు ఆహ్వానాలను పంపిస్తున్నారు. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ సినీ నటులు, క్రీడా ప్రముఖులు ఉన్నారు. అదే సమయంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనేందుకు భారీ  సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వీవీఐపీలు కూడా పాల్గొననున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..