Viral Video: కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ.. నెత్తిమీద కొడుతున్న ప్రయాణీకుడు .. షాకింగ్ వీడియో వైరల్

కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూ.. సుమారు 500 మీటర్ల వరకు ప్రయాణించాడు.. ఆ సమయంలో బోగి లోపల ఉన్న ప్రయాణీకులు దొంగ తలపై నిరంతరం కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ యువకుడు తనను కొట్టవద్దు.. కనికరించండి అంటూ వేడుకుంటున్నా ఎవరూ వినలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్ బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందినది.

Viral Video: కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతున్న దొంగ.. నెత్తిమీద కొడుతున్న ప్రయాణీకుడు .. షాకింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 17, 2024 | 6:11 PM

రైలు కిటికీ దగ్గర సీటులో కూర్చున్న ఓ మహిళ  సెల్ ఫోన్ లో మాట్లాడుతుంది. ఇంతలో ఓ యువకుడు ఆమె పైకి దూసుకెళ్లి ఫోన్ లాక్కొని పారిపోవాలని భావించాడు. అయితే ఆ యువకుడిని తోటి ప్రయాణీకులు పట్టుకున్నారు. దీంతో దొంగ ప్రయాణికుల బారి నుంచి తప్పించుకోలేకపోయిన దొంగ కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతున్నాడు. ఆగ్రహించిన ప్రయాణికులు వెంటనే మొబైల్ దొంగ తలపై కొట్టారు. ఇలా కదులుతున్న రైలు కిటికీకి వేలాడుతూ.. సుమారు 500 మీటర్ల వరకు ప్రయాణించాడు.. ఆ సమయంలో బోగి లోపల ఉన్న ప్రయాణీకులు దొంగ తలపై నిరంతరం కొడుతూనే ఉన్నారు. అప్పుడు ఆ యువకుడు తనను కొట్టవద్దు.. కనికరించండి అంటూ వేడుకుంటున్నా ఎవరూ వినలేదు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్ బీహార్‌లోని భాగల్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చెందినది. కదులుతున్న రైలు కిటికీకి మొబైల్ దొంగ వేలాడడం ఈ వీడియోలో కనిపిస్తోంది. యువకుడు ప్రయాణీకులు తనను కొట్టవద్దు అంటూ  పదే పదే వేడుకుంటున్నాడు. అయితే కాని ప్రజలు అతని తలపై నిరంతరం కొట్టడం కనిపిస్తుంది. ఆ వీడియోలో ఆ యువకుడు వదిలేయ్ బ్రదర్ అని వేడుకుంటున్నాడు.. చేయి విరిగిపోతుంది.. చనిపోతా అంటూ బతిమాలుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

మీడియా కథనాల ప్రకారం ప్యాసింజర్ రైలు అర కిలోమీటరు ప్రయాణించిన తర్వాత ఎవరో చైన్ లాగి రైలును ఆపారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు యువకుడిని కిటికీలోంచి కిందకు దించి తమతో పాటు మోజాహిద్‌పూర్ వైపు తీసుకెళ్లారు. ఆ యువకుడిని తమ వెంట తీసుకెళ్లిన వారు సహచరులని ప్రయాణికులు చెప్పడం కూడా వీడియోలో వినిపిస్తోంది. రైలులో ఉన్న చాలా మంది ప్రయాణికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేశారు. ఇది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

బీహార్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, బెగుసరాయ్ కు చెందిన ఇలాంటి వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు ప్రయాణికులు దొంగను ఒక స్టేషన్ నుండి మరొక స్టేషన్‌ కు వెళ్లే వరకూ కిటికీకి వేలాడేలా చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!