AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: తొలిసారిగా లేడీ డ్రైవర్‌ ఆటో ఎక్కిన ప్రయాణికురాలు.. ఆమె అనుభవం ఎలా ఉందంటే..

అనేక మంది వినియోగదారులు ఇలాంటి లేడీ డ్రైవర్ల డ్రైవింగ్‌ తీరును ప్రశంసిస్తూ వ్యాఖ్యనించారు. మహిళా డ్రైవర్లు.. తొందరపాటుతో డ్రైవ్ చేయరని, ఎంతో జాగ్రత్తగా తీసుకు వెళతారని అంటున్నారు. బెంగళూరులో చాలా మంది మహిళలు ఆటోలు, క్యాబ్‌లు నడుపుతున్నారని మరికొందరు చెబుతున్నారు.

Viral Post: తొలిసారిగా లేడీ డ్రైవర్‌ ఆటో ఎక్కిన ప్రయాణికురాలు.. ఆమె అనుభవం ఎలా ఉందంటే..
Autorickshaw Driven By Woman
Jyothi Gadda
|

Updated on: Jan 17, 2024 | 1:14 PM

Share

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమాజం, సంస్కృతిని మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఆడవారు ఎందులోనూ తక్కువ కాదని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. మగవారితో సమానంగా అన్ని పనుల్లో సక్సెస్‌ సాధిస్తున్నారు. ఆటో రిక్షా నడిపించటం నుంచి విమానం నడపడం వరకు ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి యువతులను చూసినా, మహిళలను చూసినా ప్రతి ఒక్కరు గర్వపడతారు. ఈరోజు సోషల్ మీడియాలో కూడా అలాంటి పోస్ట్ వైరల్ అవుతోంది. భారతదేశంలో మహిళా ఆటో-రిక్షా డ్రైవర్లు ఉన్నారు. ఏళ్ల తరబడి పురుషులే ఆధిపత్యం చెలాయించిన వృత్తిలో ఇప్పటికీ తమదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ కోవకు చెందిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్ట్‌..పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులో ఆటో నడుపుతున్న ఒక మహిళ డ్రైవర్‌ ఆటోలో ఒక మహిళ ప్రయాణికురాలు ఎక్కింది.. తొలిసారి మహిళ డ్రైవర్‌ ఆటోలో ఎక్కిన ప్రయాణికురాలు..తొలుత ఆశ్చర్యపోయిందట. తన అనుభవాన్ని, ఆలోచనను X లో ఒక పోస్ట్‌ ద్వారా పంచుకుంది. తాను యాప్‌ ద్వారా బుక్ చేసుకున్న ఆటోను ఓ మహిళ నడపడం చూసి ప్రకృతి అనే యూజర్ సంతోషం వ్యక్తం చేశారు. మహిళా డ్రైవర్‌ చూపిస్తూ.. ఫోటోను షేర్‌ చేసింది. తొలిసారిగా నేను లేడీ ఆటో డ్రైవర్‌ ఉన్న ఆటోలో ఎక్కానని ఇది నాకు సంతోషంగా ఉందని ఆ ప్రకృతి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ప్రకృతి షేర్‌ చేసిన ఈ పోస్ట్‌కి నాలుగు రోజుల్లోనే మూడు లక్షలకు పైగా వీక్షణలు, వేలాది లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు చాలా మంది తమ అనుభవాలను అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అనేక మంది వినియోగదారులు ఇలాంటి లేడీ డ్రైవర్ల డ్రైవింగ్‌ తీరును ప్రశంసిస్తూ వ్యాఖ్యనించారు. మహిళా డ్రైవర్లు.. తొందరపాటుతో డ్రైవ్ చేయరని, ఎంతో జాగ్రత్తగా తీసుకు వెళతారని అంటున్నారు. బెంగళూరులో చాలా మంది మహిళలు ఆటోలు, క్యాబ్‌లు నడుపుతున్నారని మరికొందరు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..