Mumbai Atal Setu: అటల్‌ సేతుపై ప్రత్యక్షమైన ఆటో రిక్షా.. ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు..

‘వావ్‌.. మొత్తానికి ఆటో రిక్షాను వేగంగా వెళ్లే వాహనాల కేటగిరీలో చేర్చవచ్చు’ అంటూ కొందరు కామెంట్ చేయగా.. అతనికి ఫైన్‌ వేయకండి అంటూ మరికొందరు ట్విట్‌ చేశారు.. కేవలం వేగంగా వెళ్లే ఫోర్‌ వీలర్‌ వాహనాలుకు మాత్రమే ఈ బ్రిడ్జ్‌పై అనుమతి ఉంది. అయితే త్రీ వీలర్‌ అయిన ఆటో రిక్షా అటల్‌ సేతుపై ప్రత్యక్షం కావటంతో అసలు టోల్‌బూత్‌లను దాటుకొని అది ఎలా బ్రిడ్జ్‌పైకి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Mumbai Atal Setu: అటల్‌ సేతుపై ప్రత్యక్షమైన ఆటో రిక్షా.. ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్న నెటిజన్లు..
Mumbai New Atal Setu
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 17, 2024 | 1:10 PM

అటల్ సేతు ట్రాన్స్ హార్బర్ లింక్‌ దీనినే ‘ముంబాయ్‌ ట్రాన్స్ హార్బర్‌ లింక్‌’ అని కూడా అంటారు… కొద్ది రోజుల క్రితం వాణిజ్య రాజధాని ముంబైలో ఈ అత్యంత పొడవైన సముద్రపు బ్రిడ్జ్‌ని ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా మంది ప్రయాణికులు తమ కార్లను పక్కకు పెట్టి ఈ వంతెనపై ఫొటోలు దిగుతూ.. వీడియోలు తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అంతే కాదు ఈ బ్రిడ్జిని టూరిస్ట్ స్పాట్ లా తీర్చిదిద్దారు. దాంతో ఒకట్రెండు రోజుల్లోనే ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఈ వంతెనపై చెత్త చెదారం, ఆకు-గుట్కా ఉమ్మి వేసిన గుర్తులతో మురికి కూపంగా మారింది..ఇందుకు సంబందించిన అనేక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అటల్‌ సేతు వంతెనకు సంబందించి మరో కొత్త ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వంతెనపై కనిపించిన ఆటో రిక్షా ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది.. దీంతో ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)పై నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారనే దానిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్త మవుతున్నాయి.

అటల్‌ సేతుపై ఆటో రిక్షా వెళ్లటంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. శరావనన్‌ రాధాకృష్ణన్‌ అనే ఓ వ్యక్తి ‘ఎక్స్‌’ ట్విటర్‌లో అటల్‌ సేతుపై ఆటో రిక్షా వెళ్లుతున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. ట్రాఫిక్‌ నిబంధలను ఉల్లఘించి అటల్‌ సేతుపై ఆటో రిక్షా ఎలా వచ్చిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సముద్ర బ్రిడ్జ్‌పైకి టూ వీలర్‌, త్రీవీలర్‌ వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు.. కేవలం వేగంగా వెళ్లే ఫోర్‌ వీలర్‌ వాహనాలుకు మాత్రమే ఈ బ్రిడ్జ్‌పై అనుమతి ఉంది. అయితే త్రీ వీలర్‌ అయిన ఆటో రిక్షా అటల్‌ సేతుపై ప్రత్యక్షం కావటంతో అసలు టోల్‌బూత్‌లను దాటుకొని అది ఎలా బ్రిడ్జ్‌పైకి వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘వావ్‌.. మొత్తానికి ఆటో రిక్షాను వేగంగా వెళ్లే వాహనాల కేటగిరీలో చేర్చవచ్చు’ అంటూ కొందరు కామెంట్ చేయగా.. అతనికి ఫైన్‌ వేయకండి అంటూ మరికొందరు ట్విట్‌ చేశారు..మొత్తానికి అటల్‌ సేతుపై ప్రత్యక్షమైన ఆటో ఫోటోతో ముంబై ట్రాఫిక్‌ పోలీసులకు పెద్ద చిక్కే వచ్చిపడినట్టయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!