AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి బల్లిని ఎప్పుడైనా చూశారా.. మినీ డైనోసార్ అని పిలుస్తారు.. వీడియో వైరల్

ఒక వ్యక్తి వెనుక వింతగా కనిపించే బల్లి ఎలా నడుస్తుందో వీడియోలో మీరు చూడవచ్చు. వ్యక్తి ఆ బల్లి నుంచి  ఎంత దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తే.. అది అతనికి మరింత దగ్గరవుతుంది. అప్పుడు అకస్మాత్తుగా దూకి అతని పాదాలను కౌగిలించుకుంటుంది. అతడిని నోరు తెరచి ఏదో అడుగుతున్నట్లుంది. నిజానికి, ఈ వింత బల్లి పేరు ఫ్రిల్‌నెక్ బల్లి.

Viral Video: ఇలాంటి బల్లిని ఎప్పుడైనా చూశారా.. మినీ డైనోసార్ అని పిలుస్తారు.. వీడియో వైరల్
Frilled Dragon
Surya Kala
|

Updated on: Jan 15, 2024 | 12:41 PM

Share

ఈ భూమిపై మిలియన్ల సంఖ్యలో జంతువులు కనిపిస్తాయి. వాటిలో కొన్నిటిని మనం ప్రతిరోజూ చూస్తాము.  మరి కొన్ని అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఒకొక్కసారి చాలా వింతగా కనిపించే జీవులు కనిపిస్తాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. కొన్ని జీవులు అంతరించి పోయిన జీవులకు సంబంధించిన  సినిమాలను కూడా చూస్తూ ఉంటాం. అలాంటి జీవుల్లో ఒకటి డైనోసార్లు. వీటిని ఎక్కువగా సినిమాల్లో చూసి ఉంటారు. ఒకప్పుడు రాక్షస బల్లులైన ఈ డైనో సార్లు మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి నుండి అంతరించిపోయారని నమ్ముతారు. అయితే ప్రస్తుతం డైనోసార్‌లను గుర్తుకు తెచ్చే వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో బల్లికి సంబంధించినది అయినప్పటికీ.. ఇది సాధారణ బల్లుల వలె చిన్నదిగా కనిపిస్తుంది. అయితే దాని నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది.

ఒక వ్యక్తి వెనుక వింతగా కనిపించే బల్లి ఎలా నడుస్తుందో వీడియోలో మీరు చూడవచ్చు. వ్యక్తి ఆ బల్లి నుంచి  ఎంత దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తే.. అది అతనికి మరింత దగ్గరవుతుంది. అప్పుడు అకస్మాత్తుగా దూకి అతని పాదాలను కౌగిలించుకుంటుంది. అతడిని నోరు తెరచి ఏదో అడుగుతున్నట్లుంది. నిజానికి, ఈ వింత బల్లి పేరు ఫ్రిల్‌నెక్ బల్లి. అంతేకాదు ఫ్రిల్-నెక్డ్ లిజార్డ్ లేదా ఫ్రిల్డ్ డ్రాగన్ అని కూడా అంటారు. ఇది వేరే  ప్రపంచంలోని జీవిలా కనిపించే విధంగా దీని మెడ చుట్టూ ఉన్న చర్మాన్ని సాగదీస్తుంది. కొంతమంది దీనిని చిన్న జాతి డైనోసార్ అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

డ్రాగన్ బల్లికి చెందిన ఈ వీడియో ఆస్ట్రేలియాకు చెందినది. ఇది ఎర్త్‌పిక్స్ అనే ఐడితో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది, ఇది ఇప్పటివరకు 2.6 మిలియన్లు అంటే 26 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 60 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ‘బల్లి నీళ్లు అడుగుతుందేమో’ అని ఎవరో కామెంట్ చేస్తుంటే , ‘మినీ డైనోసార్’ అని ఎవరో అభివర్ణించగా, ఇప్పటి వరకు ఇలాంటి బల్లిని చూడలేదని కొందరు వినియోగదారులు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది