AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రిలాక్సింగ్ మూడ్‌లో పెద్ద పులి.. నదిలో బంతితో ఆడుకుంటూ ఎంజాయ్

పెద్ద పులులు వేటాడడం, పోరాడడం, గంభీరంగా నడవడం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పులులు ప్రశాంతంగా ప్రవర్తించడం, ఆడుకోవడం, చిన్నపిల్లల్లా ఉల్లాసంగా ఉండడం మీరెప్పుడైనా చూశారా? అప్పుడు ఈ వైరల్ వీడియో అవుతున్న చూడండి. ఇక్కడ ఒక పులి వేట నుండి విరామం తీసుకుంటుంది. నీటిలో ఉల్లాసంగా విశ్రాంతి తీసుకుంటుంది.

Viral Video: రిలాక్సింగ్ మూడ్‌లో పెద్ద పులి.. నదిలో బంతితో ఆడుకుంటూ ఎంజాయ్
Tiger Plays With Ball
Surya Kala
|

Updated on: Jan 14, 2024 | 2:49 PM

Share

అడవిలో నివసించే కౄర జంతువులు సింహం, పులులు, ఎలుగుబంటి, చిరుత పులులు వంటివి అనేకం ఉన్నాయి. అడవిలో ఈ జంతువులు చూస్తే చాలు భయంతో వణికిపోతారు. తమ వేట దొరికితే చాలు గంభీరంగా నడుస్తూ మాటు వేసి ఉంటాయి. అయితే పెద్ద పులులు వేటాడడం, పోరాడడం, గంభీరంగా నడవడం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పులులు ప్రశాంతంగా ప్రవర్తించడం, ఆడుకోవడం, చిన్నపిల్లల్లా ఉల్లాసంగా ఉండడం మీరెప్పుడైనా చూశారా? అప్పుడు ఈ వైరల్ వీడియో అవుతున్న చూడండి. ఇక్కడ ఒక పులి వేట నుండి విరామం తీసుకుంటుంది. నీటిలో ఉల్లాసంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ క్యూట్ వీడియోను ఇష్టపడుతున్నారు.

ఈ వీడియో kami-katze Cat ART అనే ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేయబడింది. పులి పూర్తి రిలాక్సింగ్ మూడ్‌లో ఉన్నట్లు ఉంది. చెరువు నీటిలో ఉల్లాసంగా.. రిలాక్స్‌గా ఉన్న ఒక అందమైన దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు. వైరల్ వీడియోలో ఒక చెరువులో పులి వేటతో అలసిపోయి, విశ్రాంతి తీసుకుంటుంది. అయితే చేతిలో ఎర్రటి బంతిని పట్టుకుని.. ఆ బంతిపై ముఖం ఆనించి కళ్ళు మూసుకున్న విశ్రాంతి తీసుకుంటుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

జనవరి 11న షేర్ చేసిన ఈ వీడియోకు 4.3 మిలియన్ల వీక్షణలు, రెండు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.  రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకరు అయ్యో ఈ పులి ఈత కొట్టే అందమైన దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు అని వ్యాఖ్యానించారు. మరొకరు చాలా క్యూట్ గా ఉంటుంది. పులి బంతితో ఆడుకుంటూ ఆనందిస్తున్నాడు అని వ్యాఖ్యానించారు. పులి నీటిలో ఆడుతూ విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం చాలా క్యూట్‌గా ఉందని పలువురు ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..