AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెషిన్ కంటే వేగంగా డబ్బులు లెక్కిస్తున్న యువతి.. నమ్మక పొతే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..

సాధారణంగా ఎక్కువ మొత్తంలో నోట్ల కట్టలను లెక్కించాల్సి వచ్చినప్పుడు వాటిని మెషీన్‌లో పెడతారు. అప్పుడు ఆ యంత్రం కొన్ని సెకన్ల వ్యవధిలో మొత్తం డబ్బును లెక్కించి ఎంత ఉందో చెబుతుంది. ఎక్కువ డబ్బులు లెక్కించాల్సి వచ్చినప్పుడు బ్యాంకు ఉద్యోగులు మెషీన్లు వాడడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది  ప్రజల మెదడుకు పని చెప్పి ఆలోచించమని చెబుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ మనీ మెషిన్ కంటే స్పీడ్ గా డబ్బులను లెక్కిస్తోంది. ఈ వీడియో చైనాకు చెందినదిగా చెబుతున్నారు.

Viral Video: మెషిన్ కంటే వేగంగా డబ్బులు లెక్కిస్తున్న యువతి.. నమ్మక పొతే ఈ వీడియోపై ఓ లుక్ వేయండి..
Woman Counting Currency Notes
Surya Kala
|

Updated on: Jan 12, 2024 | 8:13 PM

Share

ఒకప్పుడు బ్యాంకులో పనులన్నీ దాదాపు చేతులతో జరిగేవి. కొన్ని ఏళ్ల క్రితం వరకూ యంత్రాల వినియోగం తక్కువ. డబ్బు లెక్కపెట్టినా, ఖాతాదారుల రికార్డులు భద్రపరచుకోవాలన్నా, బ్యాంకు ఉద్యోగులు మాన్యువల్‌గానే పని చేసేవారు. అయితే ఇప్పుడు బ్యాంక్ లో పని చేసేందుకు ఇప్పుడు మెషీన్లు వచ్చాయి.  దీనివల్ల ఉద్యోగుల పని చాలా తేలికైంది. ఎక్కువ డబ్బులు లెక్కించాల్సి వచ్చినప్పుడు బ్యాంకు ఉద్యోగులు మెషీన్లు వాడడం సర్వసాధారణం. అయితే ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది  ప్రజల మెదడుకు పని చెప్పి ఆలోచించమని చెబుతోంది. ఎందుకంటే ఈ వీడియోలో ఒక మహిళ మనీ మెషిన్ కంటే స్పీడ్ గా డబ్బులను లెక్కిస్తోంది. ఈ వీడియో చైనాకు చెందినదిగా చెబుతున్నారు.

సాధారణంగా ఎక్కువ మొత్తంలో నోట్ల కట్టలను లెక్కించాల్సి వచ్చినప్పుడు వాటిని మెషీన్‌లో పెడతారు. అప్పుడు ఆ యంత్రం కొన్ని సెకన్ల వ్యవధిలో మొత్తం డబ్బును లెక్కించి ఎంత ఉందో చెబుతుంది. ఈ  వీడియోలో కనిపిస్తున్న యువతి కూడా అలాంటిదే చేయడం కనిపిస్తుంది. అయితే ఈ యువతి డబ్బులను చేతితోనే యంత్రం వేగంతో సమానంగా లెక్కిస్తోంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే డబ్బుల కట్టలను లెక్కిస్తోంది.    ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా షాక్ తింటారు.. లేదా ఈ యువతి మనిషా.. లేక యంత్రమా అని కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే సాధారణంగా ఏ మనిషి నోట్ల కట్టలను అంత వేగంగా లెక్కించలేరు. అయితే  కొంతమందికి కొన్ని రకాల ప్రతిభ ఉంటుంది.. వారికీ సులభమైన పని ఇతరులకు చాలా కష్టం.

ఇవి కూడా చదవండి

హ్యూమన్ మనీ కౌంటింగ్ వీడియో చూడండి..

<

మనసును హత్తుకున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @crazyclipsonly IDతో భాగస్వామ్యం చేయబడింది.  ‘హ్యూమన్ మనీ కౌంటర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు దీనికి. కేవలం 15 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 2.3 మిలియన్లు అంటే 23 లక్షల  వ్యూస్ ను వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. కొంతమంది వినియోగదారులు ఈ యువతి నిజంగా ఎంత వేగంగా డబ్బును లెక్కిస్తోందో.. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటే మరొకరు.. ఈ యువతి మనీ కౌంటింగ్ మెషీన్‌ను అస్సలు నమ్మదలా ఉంది అని వ్యాఖ్యానిస్తుంటే..  చెప్పాలంటే ఆమెకు డబ్బుల లెక్కింపులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని మరొకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..