AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: భళా ట్రాక్టర్ బాబు.. సంక్రాంతి పండగకి గిర్నీ కష్టాలకు చెక్.. విద్యుత్ లేకుండా ట్రాక్టర్ తోనే పిండి మిల్లు

విద్యుత్తు అవసరం లేకుండా డీజిల్ తో పనిచేస్తుండగా, ఎక్కడికైనా తీసుకెళ్లి పిండి పట్టేలా ఏర్పాటు చేశారు. తనకున్న ట్రాక్టర్ ను పిండి పట్టే గిర్నీగా అనుసంధానించాలని ఆలోచించాడు మాజిద్. తను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటి తోనే చదువును ఆపేశాడు.అనంతరం ఒక బైక్ మెకానిక్ షాప్ లో కొన్నాళ్ళు పని చేశాడు. తర్వాత స్వంతంగా చిన్నగా పిండి గిర్ని పెట్టుకున్నాడు.

Telangana: భళా ట్రాక్టర్ బాబు.. సంక్రాంతి పండగకి గిర్నీ కష్టాలకు చెక్.. విద్యుత్ లేకుండా ట్రాక్టర్ తోనే పిండి మిల్లు
Rice Flour Mill
Naresh Gollana
| Edited By: Surya Kala|

Updated on: Jan 12, 2024 | 7:22 PM

Share

]కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మాజిద్ అలీ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేసి భళా అనిపించుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ వేళ పిండి గిర్ని కష్టాలకు తనదైన స్టైల్ లో చెక్ పెట్టి… మారుమూల పల్లెల్లో ఇంటి వద్ద పిండిగిర్ని తెచ్చి మహిళల పిండి వంటల కష్టాలను తీరుస్తున్నాడు. తన వద్ద ఉన్న ట్రాక్టర్ నే పిండి గిర్ని గా తయారు చేసి.. శభాష్ అనిపించుకుంటున్నాడు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో చాలా మంది చకినాలు.. ఇతర పిండి వంటలు చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గిర్నీలు అందుబాటులో లేక.. మరికొన్ని ప్రాంతాల్లో పిండి గిర్ని ఉన్నప్పటికి విద్యుత్తు అంతరాయం ఏర్పడితే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవన్నీ గమనించిన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లోని రహ్మత్ నగర్ కు చెందిన సయ్యద్ మజీద్ అలీ ఫ్లోర్ మిల్ నిర్వాహకుడు ట్రాక్టర్ కు బియ్యం పట్టే గిర్నీని జత చేశారు. ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలో ఒక పుల్లి, ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేసి గిర్నీని అనుసంధానించారు. ఇందుకు రూ.30,000/- వేల వరకు ఖర్చు చేశారు.

ఇవి కూడా చదవండి

విద్యుత్తు అవసరం లేకుండా డీజిల్ తో పనిచేస్తుండగా, ఎక్కడికైనా తీసుకెళ్లి పిండి పట్టేలా ఏర్పాటు చేశారు. తనకున్న ట్రాక్టర్ ను పిండి పట్టే గిర్నీగా అనుసంధానించాలని ఆలోచించాడు మాజిద్. తను 7వ తరగతి వరకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకొని అంతటి తోనే చదువును ఆపేశాడు.అనంతరం ఒక బైక్ మెకానిక్ షాప్ లో కొన్నాళ్ళు పని చేశాడు. తర్వాత స్వంతంగా చిన్నగా పిండి గిర్ని పెట్టుకున్నాడు.

గిర్ని నడిపే సమయంలో గిరాకీ ఉన్నప్పుడే కరెంట్ పోవడం వల్ల ఏదో ఒకటి చేసి ఇలాంటి సమస్య నుండి బయటపడాలి అనే ఆలోచించే క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్ తో గిర్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వయంగా మెకానిక్ గా పని చేసిన అనుభవం ఉండటంతో తన ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. రెండు మూడు సార్లు తన ప్రయత్నం విఫలమైన అంతటితోనే ఆగకుండా మార్పులు చేర్పులు చేసుకుంటూ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. చివరగా తన ప్రయత్నం ఫలించి ప్రజలకు అందుబాటులో మొబైల్ పిండి గిర్ని ను తీసుకోవచ్చాడు. ప్రభుత్వం తనకు సహకరిస్తే భవిష్యత్తులో ఇలాంటి యంత్రాలు తయారీకి కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..