- Telugu News Photo Gallery Spiritual photos Sri Rama performed penance for Chartumas in Hampi and got blessings of God Virupaksha to get back Sita
Lord Sri Rama: నాటి కిష్కింద నేటి హంపి.. సీతాదేవిని తిరిగి పొందేందుకు ఇక్కడే శ్రీరాముడు విరూపాక్షుడికి పూజలు
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాముడు నడయాడిన పవిత్ర క్షేత్రాలను కొందరు గుర్తు చేసుకుంటున్నారు. వనవాస సమయంలో రామయ్య తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి దక్షిణాదిలో అనేక ప్రాంతాల్లోని అరణ్యాలలో గడిపాడు. అలాంటి పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి కర్నాటక రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న హంపి ఒకటి.
Updated on: Jan 12, 2024 | 5:49 PM

నేటి హంపి నగరంలోని అనెగుండి పట్టణం.. నాటి రామాయణంలో కిష్కిందా నగర్. ఈ కిష్కిందా నగరానికి అంటే నేటి హంపికి .. అయోధ్య రాముడికి చాలా అనుబంధం ఉంది. శ్రీరాముడు హంపిలోని కిష్కింద నగరానికి వచ్చి స్థిరపడ్డాడని.. ఇక్కడ అనేక ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పౌరాణిక నేపథ్యం ఉంది..

సీత దేవి అపహరణకు గురైన తర్వాత శ్రీ రామ చంద్రుడు సీతను వెతుక్కుంటూ హంపికి వచ్చాడని నమ్ముతారు. నేటికీ ఇందుకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. అప్పటి కిష్కింద్ నగరం ప్రస్తుత విజయనగరం జిల్లాలోని హంపిలోని అనెగుండి పట్టణం. హంపిలోని మాల్యవంత పర్వతంలోని చారిత్రాత్మక రఘునాథ ఆలయంలో శ్రీరాముడు నాలుగు నెలల పాటు తపస్సు చేశాడు

ఇక్కడ తపస్సు చేస్తున్న రాముడి విగ్రహం కూడా ఉంది. ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా కూర్చున్న రాముడు, సీత దేవి విగ్రహాలు ఉన్నాయి. ఇలాంటి విగ్రహాలు దేశంలోని మరే ప్రాంతంలోనూ కనిపించవు. అంతేకాదు శ్రీరాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు బాణాన్ని రాతి పర్వతంలో వదిలి రామతీర్థాన్ని సృష్టించాడు. ఈ తీర్ధంలోని నీరు నేటికీ ప్రవహిస్తూనే ఉంది. దీనికరణం రామ బాణం అని స్థానికుల నమ్మకం. ఇక్కడ ఉన్న శివలింగానికి శ్రీరాముడు నిత్య పూజలు చేశాడని స్థానికులు చెబుతారు.

హనుమంతుడు మాల్యవంత పర్వతం దగ్గర ఉన్న రామ లక్ష్మణుల దివ్య తేజస్సును చూసి. తన ప్రభువైన శ్రీ రామ చంద్రుడిని గుర్తించి కిష్కిందకు రామయ్య వచ్చిన సంగతి సుగ్రీవుడికి తెలియజేశాడట. అప్పుడు సుగ్రీవుడు తన అన్న వాలి నుండి తప్పించుకోవడానికి వృషి ముని కొండ ముందున్న గుహలో నివసించేవాడు.

శ్రీరాముడిని కలుసుకున్న సుగ్రీవుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి.. రావణుడు తల్లి సీతను అపహరించి పుష్పక విమానంలో తీసుకుని వెళ్లిన గుర్తుగా సీతాదేవి నగలను చూపిస్తాడు. ఆ ఆభరణాలను చూసిన తర్వాత.. అవి సీతదేవి వే అని రాముడు గ్రహించి.. అప్పుడు సీతాదేవి జాడ తెలుసుకోవడానికి వానరుల సహాయం కోరతాడు. ఆ తర్వాత వాలిని చంపి సుగ్రీవుని పట్టాభిషేకం చేసి వానర సైన్యంతో కలసి లంకకు ప్రయాణించినట్లు స్థల పురాణంగా స్తానికులు చెబుతారు.

పురాణాల ప్రకారం శ్రీరాముడు వానర సైన్యమైన సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్తాడు. అంతేకాకుండా రాముడు పంపా విరూపాక్షుడిని పూజించి ఆశీర్వాదం పొందిన తరువాత లంకకు బయలు దేరినట్లు చెబుతారు. లంకకు వెళ్ళిన తరువాత రావణుడిని సంహరించి సీతలక్ష్మణ సమేతుడై తిరిగి అయోధ్యకు వస్తున్న సమయంలో కిష్కింధ నగరంలో కొన్ని రోజులు విడిది చేసి .. అనంతరం తరువాత అయోధ్యకు బయలుదేరాడు. శ్రీరామ చంద్రుడు.. వనవాస సమయంలో హంపిలో నివసించిన జాడలు నేటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి.





























