Nalgonda: ఛీ.. ఛీ ఇదేం పాడు పని.. బైక్‌పై ఫాస్ట్‌గా వెళ్తూ.. మళ్లీ లవర్స్ అట..
ప్రేమ జంటలు సహజంగానే, బీచ్‌లు, పార్క్‌లు.. సినిమా థియేటర్లుకు తిరుగుతుంటారు. కాలక్షేపం కోసం ఎక్కడో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే.. ఇక్కడ ఒక జంట మాత్రం అందరికీ భిన్నం. ఇప్పుడు ఈ జంట కోసం నాలుగు పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి.
నల్గొండలో భలే దొంగలు సినిమా సీన్ రిపీట్ అయింది. ఆ సినిమాలో తరుణ్, ఇలియానా దొంగతనం చేసినట్లే .. నల్గొండలోనూ లవర్స్ చోరీకి పాల్పడ్డారు. స్కూటీపై వెళ్తూ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఈసీన్ చూసిన స్థానికులు వెంబడించడంతో హైస్పీడ్‌తో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
లవర్స్ అంటే ఎక్కడైన పార్కుకో లేదా సినిమాకో వెళ్లి ఎంజాయ్ చేయడం చూస్తాం. కానీ వీళ్లు మాత్రం భిన్నంగా ఉన్నారు. కలిసి దొంగతనాలకు పాల్పడుతూ నల్గొండ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. వారిని అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Jan 12, 2024 06:49 PM
వైరల్ వీడియోలు
Latest Videos